
KP Nagarjuna Reddy: ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని రాయవరం వద్ద నిర్మిస్తున్న మెడికల్ కాలేజ్ పనులను శాసనసభ్యులు కేపీ నాగార్జున రెడ్డి పలువురు ప్రజా ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. సిబ్బందితో సమావేశమై పనుల పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు. త్వరగా భవన నిర్మాణాలు పూర్తయ్యేలా కృషి చేయాలని సిబ్బందికి సూచించారు.
అంతకు ముందు ఆయన.. మార్కాపురం మండలం మాల్యమంతుని పాడు గ్రామంలో నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో మార్కాపురం శాసనసభ్యులు కేపీ నాగర్జున రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగనన్న సురక్ష పథకంలో పాల్గొన్న ప్రజలకు పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు వైద్యశాఖ సిబ్బంది.. ఈ నేపథ్యంలో కేపీ నాగార్జున రెడ్డి మాట్లాడుతూ.. జగనన్న సురక్ష పథకం ప్రతిఒక్కరు ఉపయోగించుకోవాలని ఆరోగ్యం కాపాడుకునే బాధ్యత మీదేనని వెల్లడించారు. జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ప్రజలంతా సంతోషం గా ఉన్నారని, అన్ని వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం మందులు కూడా ఉచితంగా ఇస్తారని నాగార్జునరెడ్డి అన్నారు. గనన్న సురక్ష పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని ఉద్దేశంతో జగనన్న ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాడని సూచించారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం, గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్నటువంటి పేద ప్రజలకు ఒక గొప్ప వరమని తెలియజేశారు.