Leading News Portal in Telugu

Revanth Reddy : కేసీఆర్.. కేటీఆర్ ఉద్యోగం ఊడగొడితేనే నిరుద్యోగులకు ఉద్యోగం


Revanth Reddy : కేసీఆర్.. కేటీఆర్ ఉద్యోగం ఊడగొడితేనే నిరుద్యోగులకు ఉద్యోగం

మునుగోడు, హుజురాబాద్ లో మందు..నోటు గెలిచిందన్నారు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి. నేడు రేవంత్‌ రెడ్డి అమరవీరుల స్థూపం వద్దకు వెళ్లగా.. అక్కడ ఉద్రికత్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. దీంతో రేవంత్‌ రెడ్డి పోలీసలు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. అచ్చోసిన ఆంబోతులు లెక్క బీజేపీ..బీఆర్‌ఎస్‌ పార్టీలు మునుగోడు, హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో ఖర్చు చేశాయన్నారు. కాంగ్రెస్ మీద కర్ణాటక నుండి డబ్బులు వస్తున్నాయి అని ఆరోపణలు చేస్తున్నారు కేటీఆర్..హరీష్ అని ఆయన మండిపడ్డారు. అందుకే వచ్చే ఎన్నికల్లో డబ్బు.. మద్యం పంచము అని అమర వీరుల స్థూపం దగ్గర ప్రమాణం చేద్దాం అని పిలిచానని, ఇద్దరం ప్రమాణం చేద్దాం రండి అని ఆహ్వానించానన్నారు. కానీ బీఆర్‌ఎస్‌ నేతలు రాలేదని, ప్రజలను మోసం చేసి మూడో సారి సీఎం కావాలని కేసీఆర్ చూస్తున్నారన్నారు. ఆయన పాలసీ నే మద్యం పంచి గెలవడమని, మేము అమర వీరుల స్థూపం దగ్గరికి అనుమతి లేదు అంటున్నారన్నారు.

ఎంపీ గా నేను అమర వీరుల స్థూపం కూడా వెళ్లొద్దా అని ఆయన ప్రశ్నించారు. అమర వీరుల స్థూపం దగ్గరికి బీఆర్‌ఎస్‌ నాయకులు రాలేదని, అంటే ఓట్లు కొంటాం.. అనేదే మా విధానం అని ఒప్పుకున్నారన్నారు. ప్రవళిక పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకుందని, వాయిదా పడుతున్నాయి అని చనిపోతే ఆత్మహత్య కి ప్రేమ కారణం అంటూ పరువు తీశారన్నారు. హాల్ టికెట్ కూడా ఉందని, కేటీఆర్ అసలు దరఖాస్తే చేయలలేదు అన్నాడని, డీసీపీ నిర్భయ చట్టం ఉల్లంఘించారన్నారు. పేరు.. వివరాలు బయట పెట్టొద్దు అని నిబంధన ఉందని, సేకరించిన ఆధారాలు కోర్టులో ఇవ్వాలని, కోర్టు అనుమతి లేకుండా బయట పెట్టొద్దన్నారు. డీసీపీ ప్రభుత్వాన్ని రక్షించే పని చేశారని, సమాజంలో ఆ కుటుంబంని పరువు తీశారన్నారు. రిటైర్డ్ అధికారులను ఎన్నికల అధికారులు ఎందుకు కంటిన్యూ చేస్తోందని, అధికారులను మార్చాం అని చెప్పే ఈసీ.. రిటైర్డ్ అధికారులను ఎందుకు తొలగించరని ప్రశ్నించారు రేవంత్‌.

మేనిఫెస్టో లో మేము ఏది చెప్తే దానికి ఐదు వందల ఎక్కువ అని కేసీఆర్ అన్నాడని, మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని మేము అన్నం.. రెండున్నర లక్షల ఉద్యోగాలు ఇస్తా అని కేసీఆర్ ఎందుకు చెప్పలేదు.. నియామకాల ప్రస్తావన లేదు కేసీఆర్.. నిరుద్యోగులు.. మీ ఓటు..మీ అమ్మానాన్న ఓటు కాంగ్రెస్ కి వేయించండి. కేసీఆర్.. కేటీఆర్ ఉద్యోగం ఊడగొడితేనె నిరుద్యోగులకు ఉద్యోగం. నిరుద్యోగులు అంతా ఏకం అవ్వండి. డీసీపీ పై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేస్తాం. అన్ని పోలీసు స్టేషన్ లలో ఫిర్యాదు చేస్తాం. చర్యలు తీసుకోకపోతే.. న్యాయపరమైన చర్యలు. మోడీ..అమిత్ షా, కేసీఆర్..కేటీఆర్.. అక్బర్..అసద్ ఒక్కటే.. ఒకరు తప్పు చేస్తారు.. ఇంకొకరు సమర్దిస్తారు. ముక కవళికలు వేరు కానీ ఆలోచనలు అన్నీ ఒక్కటే. కేటీఆర్ పుట్టక ముందే వ్యవసాయం కోసం ఎన్నో చేసింది కాంగ్రెస్. గుజరాత్ గులాం లు వద్దు.. చింతమడక చీటర్స్ అవసరం లేదు. వీళ్లిద్దరి నుండి విముక్తి కోసమే కాంగ్రెస్ ప్రయత్నం’ అని రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.