Leading News Portal in Telugu

Water Workouts : వాటర్ లో ఈ వర్కౌట్స్ చేస్తే బరువు తగ్గుతారా?


Water Workouts : వాటర్ లో ఈ వర్కౌట్స్ చేస్తే బరువు తగ్గుతారా?

కొంతమంది లావుగా ఉండటం వల్ల ఫిట్ గా ఉండలేక పోతారు.. మరికొంతమంది సన్నగా ఉన్నా స్కిన్ లూజ్ గా ఉంటుంది.. మంచి వర్కౌట్స్ చేస్తేనే బాడీ ఫిట్ గా అందంగా ఉంటుంది.. బాడీ ఫిట్నెస్ కోసం వాటర్ వర్కౌట్స్ చాలా మంచివని నిపుణులు చెబుతున్నారు.. ఈ వర్కౌట్స్ ను ఎలా చేస్తారు.. ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

వాటర్ పుషప్స్ చేయడానికి దీని వల్ల బెనిఫిట్స్ ఉంటాయి. బలాన్ని పెంచుతాయి. ఛాతీ వరకూ ఉండే నీటిలో ఉంచి పూల్ అంచున ఉండి చేతులను అంచున భుజం వెడల్పు కంటే కొంచెం వెడల్పుగా ఉంచండి. మీ ఛాతీని నీటి వైపుకి తగ్గించి ఆపై మిమ్మల్ని తిరిగి స్టార్టింగ్ పాయింట్‌కి రండి. దీని వల్ల చేతులు, ఛాతీ, భుజాలు నిమగ్నమవుతాయి. కోర్ కూడా ఎంగేజ్ చేయాలి… దీంతో ఫిట్ గా మారతారు..

వాటర్ లో వాకింగ్.. నీటిలో నడవడం వల్ల క్యాలరీలు బర్న్ అవుతాయి. అలాగే మీ కోర్, లెగ్ మజిల్స్‌ని బలంగా చేయడానికి హెల్ప్ చేస్తాయి. కాబట్టి, మీరు నీటిలో మోకాళ్ళని వంచి కాళ్ళను పైకి రెండు మోకాళ్ళని మీ ఛాతీ వైపుకి తీసుకురావడానికి ప్రయత్నించాలి. క్రమంగా, కష్టతరమైన స్థాయిని పెంచడానికి మీ సెట్స్ మధ్య పూల్ దిగువన పాదాలు తాకకుండా చూసుకోవాలి..

స్విమ్మింగ్ పూల్‌లో వెయిట్ వర్కౌట్స్ చేయడం మంచిది. దీని వల్ల చేతులు, కాళ్ళని ఇన్వాల్వ్ చేయడంతో టోన్ అవుతాయి. దీని వల్ల అదనపు కొవ్వు తగ్గుతుంది. మీరు ఎక్కువ కేలరీలని బర్న్ చేస్తుంది. దీంతో బరువు కూడా తగ్గుతారు.. నీటిలో ఉన్నప్పుడు పోమ్ డంబెల్స్ ను ఎత్తడం మంచిది..

వాటర్ లో వర్కౌట్స్ చెయ్యడం వల్ల కలిగే లాభాలు?

ఇలా వర్కౌట్స్ చేయడం వల్ల కండరాల బలం పెరుగుతుంది. బ్యాలెన్స్ సరిగ్గా ఉంటుంది. దీని వల్ల ఎలాంటి సమస్యలు రావు. కండరాలు బలంగా మారతాయి. ఫిట్‌గా మారతారు.. ఎనర్జీగా ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..