
Pakistan Players suffer with viral fever ahead of AUS vs PAK Match: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా గత శనివారం టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో ఓడిన పాకిస్తాన్.. మరో కీలక సమరానికి సిద్దమైంది. అక్టోబర్ 20న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియాతో పాక్ తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే బెంగళూరు చేరుకున్న పాకిస్తాన్ ప్లేయర్స్ సాధన చేస్తున్నారు. అయితే ప్రస్తుతం పాకిస్థాన్ జట్టును వైరల్ ఫీవర్ (విష జ్వరాలు) బాధిస్తున్నాయని పీసీబీ మీడియా మేనేజర్ అషాన్ ఇఫ్తికార్ చెప్పాడు.
భారత్‌తో మ్యాచ్ తర్వాత పాకిస్తాన్ ఆటగాళ్లు వైరల్ ఫీవర్ బారిన పడ్డారు. జట్టులోని చాలా మంది ఆటగాళ్లకు వైరల్ ఫీవర్ సోకింది. అయితే చాలా మంది ఆటగాళ్ల ఆరోగ్యం ఇప్పుడు మెరుగుపడింది. ఇద్దరు ప్లేయర్స్ మాత్రం ఇంకా కోలుకోలేదని సమాచారం. ఇందులో ఒకరు ఇప్పటికీ ఫ్లూతో బాధపడుతున్నారట. కోలుకుంటున్న వారు టీమ్ మెడికల్ కమిటీ పర్యవేక్షణలో ఉన్నారని అషాన్ ఇఫ్తికార్ తెలిపారు. కెప్టెన్ బాబర్ అజామ్, స్టార్ పేసర్ షహీన్‌షా అఫ్రిది ఆరోగ్యంగానే ఉన్నారని సమాచారం.
Also Read: Fastest Half Century: యువరాజ్ సింగ్ రికార్డు బద్దలు.. 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదిన భారత ప్లేయర్!
ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్ లోపు పాకిస్తాన్ ఆటగాళ్లంతా కోలుకుని (Pakistan Players Viral Fever) ఫిట్‌గా ఉంటారని పీసీబీ ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే ఫ్లూతో బాధపడుతున్న ప్లేయర్ మాత్రం ఆస్ట్రేలియాతో మ్యాచ్‌కు అనుమానంగానే ఉందని తెలుస్తోంది. ఆ ఆటగాడి వివరాలు ఇంకా తెలియరాలేదు. మంగళవారం పాక్ జట్టు సభ్యులు చిన్నస్వామి స్టేడియంలో సాధన చేశారు. సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు ప్రాక్టీస్ ఉండగా.. ఆటగాళ్ల అస్వస్థత కారణంగా ప్రాక్టీస్ సెషన్‌ను గంటకు కుదించారు.