
బాలీవుడ్ హాట్ బ్యూటి రౌతాల బంపర్ ఆఫర్ ప్రకటించింది. తనకు ఎంతో ఇష్టమైన ఫోన్ పొగొట్టుకున్న సంగతి తెలిసిందే.. ఆ ఫోన్ ఎక్కడ ఉంది.. ఎవరి దగ్గర ఉందో తెలుసుకొనేందుకు అమ్మడు తెగ కష్టపడుతుంది.. ఎప్పుడూ హాట్ ఫోటోలను షేర్ చేసే ఈ అమ్మడు ప్రస్తుతం తన ఫోన్ కోసం ఎంత బాధపడుతుందో చెప్పు కోస్తుంది.. తాజాగా తన ఫోన్ కోసం ఒక బంఫర్ ఆఫర్ ను ప్రకటించింది.. పోగొట్టుకున్న తన ఫోన్ కనుగొనడంలో సాయం చేసిన వారికి రివార్డ్ కూడా ప్రకటించింది ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ.. అందుకు సంబందించిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..
ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ పెట్టింది. అందులో తన ఫోన్ చివరి సారిగా అహ్మదాబాద్‌లోని ఓ మాల్ వద్ద ఉన్నట్లు తెలిపింది. ఫోన్‌ను తిరిగి తెచ్చిస్తే రివార్డు ఇస్తానంటూ ప్రకటించింది. అయితే ఆ రివార్డు ఏంటన్నది మాత్రం వెల్లడించలేదు. ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య మొన్న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎగబడ్డారు. సెలబ్రిటీలు కూడా ఆరాటపడ్డారు. ఇండియా.. పాక్ మ్యాచ్ కావడంతో చాలా మంది ఉన్నారు.. ఆ మ్యాచ్ లో కూడా అమ్మడు తెగ హడావిడి చేసేంది.. మ్యాచ్ గెలిచింది ఇండియా కానీ అమ్మడుకు మాత్రం భాదను మిగిల్చింది..
తాను ఎంతో ఇష్టంగా కొనుకున్న ఫోన్ పోగోట్టుకుంది. అత్యంత ఖరీదైన తన మొబైల్ ఫోన్‌ను పోగొట్టుకున్నట్టు.. విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించారు. అది 24 క్యారెట్ల బంగారు తాపడం చేయించిన ఫోన్ కావడంతో తన భాధని వివరించలేకున్నాం.. అంతగా ఆరాట పడుతుంది అమ్మడు.. ఇక సినిమాల విషయానికొస్తే.. బాలీవుడ్ కంటే కూడా ఆమెకు సౌత్ సినిమాల నుంచే డిమాండ్ ఎక్కువైపోయింది. సౌత్ సినిమాల్లో ఎక్కువగా స్పెషల్ సాంగ్స్ చేస్తోంది బ్యూటీ. ఒక్క సాంగ్ కు కోటి నుంచి రెండు కొట్లు తీసుకుంటుంది..