Leading News Portal in Telugu

Kottu Satyanarayana: మూలా నక్షత్రం రోజు కనకదుర్గమ్మ దర్శనానికి సీఎం జగన్‌..


Kottu Satyanarayana: మూలా నక్షత్రం రోజు కనకదుర్గమ్మ దర్శనానికి సీఎం జగన్‌..

Kottu Satyanarayana: ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.. రోజుకో రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు.. నాలుగో రోజు శ్రీమహాలక్ష్మీ దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు దుర్గమ్మ.. ఇక, కనకదుర్గమ్మ దర్శనానికి రానున్నారు సీఎం వైఎస్‌ జగన్.. ఈ నెల 20న మూలా నక్షత్రం రోజున ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ కనకదుర్గమ్మ వారిని దర్శించుకుంటారు అని తెలిపారు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ.. సీఎం అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించటం ఆనవాయితీగా వస్తోంది.. మూలా నక్షత్రం రోజు అమ్మవారిని లక్ష నుంచి లక్షన్నర మంది భక్తులు దర్శించుకుంటారని అంచనా వేస్తున్నాం అన్నారు. దానికి తగినట్లు అదనపు కౌంటర్లు, తాగు నీరు, ప్రసాదాలు వంటి ఏర్పాట్లు చేస్తున్నాం.. మొదటి రోజు చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యాయి.. ఎప్పటికప్పుడు పరిస్థితులు సమీక్షించుకుంటున్నాం అని ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు.

ఇక, దసరా అన్నదానం వద్ద భక్తులతో కలిసి భోజనం చేశారు మంత్రి కొట్టు సత్యనారాయణ.. ఆ తర్వాత ఎన్టీవీతో మాట్లాడిన ఆయన.. అన్నదానం ఏర్పాట్లు పరిశీలించాను.. భక్తులు ఎంతో అద్భుతమైన ప్రసాదం అందించారని చెప్పారు.. సామాన్య భక్తుడిలా నేను కూడా భోజనం చేశా.. రైస్, ఇతర పదార్ధాలు క్వాలిటీ గా అందిస్తున్నారని వెల్లడించారు. మంత్రిగా కాకుండా భక్తుడిగా నేను ప్రసాదాన్ని తీసుకుంటున్నా.. భక్తులకు అందించే పదార్ధాల క్వాలిటీ తగ్గదని స్పష్టం చేశారు. భక్తులందరూ అన్న ప్రసాదం స్వీకరించాలని కోరారు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ.