చంద్రబాబు గొప్ప విజనరీ.. కన్వాల్ లేఖీ | babu a great visionary says kanval lekhi| inventus| md| cbn| illegal| arrest| protest| all
posted on Oct 18, 2023 2:17PM
నారా చంద్రబాబు నాయుడు.. అభివృద్ధికి ఐకాన్. ప్రజా సంక్షేమానికి కేరాఫ్ అడ్రస్. సాంకేతికతను ప్రజా ప్రయోజనాలకు అనుసంధానం చేయడంలో ముందుంటారు. అందరూ రేపటి గురించి ఆలోచిస్తే.. చంద్రబాబు మాత్రం రేపటి తరం గురించి కూడా ఆలోచిస్తారు. ఇలా చంద్రబాబు గురించి ఎంత చెప్పినా, ఎంత చెప్పుకున్నా తక్కువే. అటువంటి చంద్రబాబును.. విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందించి వారికి ఉఫాథి, ఉద్యోగావకాశాలు కల్పించాలన్న సదుద్దేశంతో తీసుకువచ్చిన స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ జగన్ సర్కార్ అక్రమంగా అరెస్టు చేసింది. ఒక్క ఆధారం చూపకుండా.. అరెస్టు చేసేసి, ఇప్పుడు ఎలాగూ అరెస్టు చేశాం కదా.. ఆయనను విచారించి ఆధారాలు సంపాదిస్తామన్న వితండవాదన చేస్తోంది.
ఈ కేసులో కావాలనుకుంటే చంద్రబాబుకు ఒక్క రోజులో బెయిలు మంజూరై ఉండేది. అయితే ఆయన బెయిలుపై బయటకు రావడం కంటే.. తనపై కేసునే సవాల్ చేయడానికే చంద్రబాబు మొగ్గు చూపారు. అందుకే ఇది తప్పుడు కేసు క్వాష్ చేయండంటూ కోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం తనకు అలవాటైన సాగదీత విధానంతో కోర్టులో క్వాష్ పిటిషన్ పై తీర్పు జాప్యం అయ్యేలా అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నది. అందులో కొంత మేరకు సఫలమైందనే చెప్పాలి. అయితే కోర్టుల్లో వాదనల్లో ప్రభుత్వ డొల్లతనం ప్రస్ఫుటంగా బయటపడుతోంది. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని సామాన్యులకు, చిన్న పిల్లలకు సైతం అర్థమైపోయింది. చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై ఒకటి రెండు రోజులలో తీర్పు వచ్చే అవకాశం ఉంది.
అయితే చేయని నేరానికి, లేని కేసులో జగన్ ప్రభుత్వం చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిన తీరుపై రాజకీయాలతో సంబంధం లేకుండా అన్ని వర్గాల నుంచీ ఖండనలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్య ప్రజలు, ఐటీ ఉద్యోగులు ఇలా ప్రతి ఒక్కరు రోడ్ల పైకి వచ్చి తమ నిరసనలను తెలుపుతూ..బాబు కు సంఘీభావం చెపుతున్నారు. రాజకీయాలతో ఇసుమంతైనా సంబంధం లేని పారిశ్రామిక వేత్తలు, బిజినెస్ సర్కిల్స్ లో దిగ్గజాలైన వారు కూడా సామాజిక మాధ్యమంలో స్పందిస్తున్నారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తున్నారు. ఇ యామ్ విత్ బాబు హ్యాట్ టాగ్ తో వారి పోస్టులు వైరల్ అవుతున్నాయి.
తాజాగా చంద్రబాబు అక్రమ అరెస్టుపై ఇన్వెంటస్ ఎండీ కన్వాల్ రేఖీ లింకెన్డెన్ లో షేర్ చేసిన పోస్టులో చంద్రబాబు ఓ విజనరీ అంటూ పేర్కొన్నారు. ఆయన దార్శనికత.. చిట్టడవిలా.. కొండలు, గుట్టలతో నిండిన నిర్మాణుష్య ప్రదేశాన్ని హైటెక్ సిటీగా మార్చిందని పేర్కొన్నారు. సంపద సృష్టిలో దేశానికి రెండో ఆర్థిక రాజధానిగా గుర్తింపు పొందింది. చంద్రబాబు విజన్ హైదరాబాద్ ను ఐటీ హబ్ గా మార్చేసిందని పేర్కొన్నారు. హైదరాబాద్ ను ఐటీ హబ్ గా మార్చే క్రమంలో సైబరాబాద్ నగర నిర్మాణానికి, రాష్ట్ర భవిష్యత్, పురోగతి, ప్రగతి, పెట్టుబడుల ఆకర్షణ కోసం చంద్రబాబు పడిన తపన, అందుకోసం ఒక ముఖ్యమంత్రిగానే కాకుండా రాష్ట్రానికి సీఈవోగా ఆయన చేసిన కృషి ప్రస్తావించి ఆయన నిజంగా చాలా చాలా గ్రేట్ అని కన్వాల్ రేఖీ పేర్కొన్నారు.
అప్పట్లో విదేశీ దిగ్గజ సంస్థల అధినేతలు, ప్రతినిథులతో ఆయన నిర్వహించిన సమావేశం వివరాలనూ వివరించారు. తానూ ఆ సమావేశంలో భాగస్వామినేనని పేర్కొన్న ఆయన.. ఆ సమావేశానికి ముందు జరిగిన వివరాలను పూసగుచ్చినట్లు వివరించారు. వాస్తవానికి తాము హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లాల్సి ఉందనీ, అయితే అప్పటికి దుబాయ్ లో ఉన్న చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసి పొద్దున్నే తాను వచ్చి కలుస్తాను ఉండమని కోరారు. అన్నట్లుగానే తెల్లవారి నాలుగు గంటలకల్లా చంద్రబాబు తమతో భేటీ అయ్యారని కన్వాల్ రేఖీ పేర్కొన్నారు. ఆ భేటీలో రాష్ట్ర భవిష్యత్, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, ఐటీ పురోగతి తదితర అంశాలపై తమ మధ్య అర్ధవంతమైన చర్చ జరిగిందనీ, భేటీ తరువాత ఆయన తమను పోలీసు ఎస్కార్ట్ తో ఎయిర్ పోర్టుకు పంపించారని కన్వాల్ రేఖీ పేర్కొన్నారు. అటువంటి విజన్ ఉన్న నేత, అభివృద్ధి కోసం, ప్రగతి కోసం అంతగా తపనపడే నేత చంద్రబాబునాయుడు తప్ప మరొకరు ఉండరని పేర్కొన్నారు.
కన్వర్ రేఖి పోస్టు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతోంది. చంద్రబాబు వంటి గొప్ప నేతను అక్రమంగా అరెస్టు చేయడంతో ప్రపంచ వ్యాప్తంగా భారత్ ప్రతిష్ట మసకబారిందని నెటిజన్లు అంటున్నారు. జగన్ ఒక సైకో సీఎం అని సందేహాతీతంగా చంద్రబాబు అక్రమ అరెస్టు రుజువు చేసిందని విమర్శలు గుప్పిస్తున్నారు.
ఒక దార్శనికుడిని రాజకీయ వైరంతో మరుగున పడేయాలని చూస్తే ఆకాశంపై ఉమ్ము వేయడానికి చూసినట్లే. చంద్రబాబు విషయంలో ఈ విషయం పదే పదే రుజువు అవుతోంది. ఇప్పుడు జగన్ సర్కార్ ఆయనపై కక్ష సాధింపుతో వ్యవహరిస్తోంది. దీనివల్ల ఆన ప్రతిష్టకు కానీ, గొప్పతనానికి కానీ వీసమెత్తు నష్టం జరగలేదు.. కానీ అక్రమంగా అరెస్టు చేసిన జగన్ ప్రతిష్ట మాత్రం పాతాళానికి పడిపోయింది. దేశ విదేశాల నుంచి ఆయన అక్రమ అరెస్టును ఖండిస్తూ వెల్లువెత్తుతున్న ఆందోళనలే సాక్ష్యం. నిజమైన అభివృద్ధి, ప్రజా ప్రయోజనాలకు సాంకేతికతను ఆయన ఉపయోగించిన తీరు మేధావులూ, ప్రగతి కాముకులు, ప్రజా ప్రయోజనాలే పరమార్ధంగా తమతమ రంగాలలో నిష్ణాతులైన వారూ చంద్రబాబుకు సంఘీభావం తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ హైదరాబాద్ క్యాంపస్ ఆవిర్బావానికి కర్త, కర్మ, క్రియ అన్నీ తానై వ్యవహరించిన చంద్రబాబు ముందు చూపును ప్రస్తావిస్తూ నాడు ఆయన హైదరాబాద్ కు ఇండియన్ బిజినెస్ స్కూలు రావడంలో పోషించిన పాత్రను గుర్తు చేస్తున్నారు. రాజకీయాల కంటే రాష్ట్ర ప్రగతి, పురోగతికే ప్రాధాన్యత ఇచ్చి, వర్తమానంతో పాటు భవిష్యత్ తరాల బాగును దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు, అనుసరించిన విధానాలే ఆయనకు ఒక ప్రత్యేక నేతగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టాయని ప్రశంసలు గుప్పిస్తున్నారు.