
Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు హెల్త్ రిపోర్ట్ ను చంద్రబాబు న్యాయవాదులను నమ్మి ఇస్తే లీక్ చేశారని మండిపడ్డారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. తాడేపల్లిలో ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని కోర్టు నమ్మింది.. అందుకే తన కస్టడీలోకి తీసుకుంది.. అయినా టీడీపీ నేతలు ఎందుకు బుకాయిస్తున్నారు? అని నిలదీశారు.. దోమలు, ఉక్కుపోత, రోగాలు.. పేరుతో ఇలా రోజుకు ఒక రచ్చ చేస్తున్నారని మండిపడ్డారు.. చంద్రబాబుకు ఉన్న చర్మ రోగాలను టీడీపీ నేతలే బహిరంగ చర్చకు పెడుతున్నారు.. చంద్రబాబు బట్టలు విప్పి రోడ్డు మీద పెడుతున్నది ఆయన కుటుంబ సభ్యులు, ఆ పార్టీ నేతలే అంటూ ఆరోపణలు గుప్పించారు. చంద్రబాబు హెల్త్ రిపోర్ట్ ను చంద్రబాబు న్యాయవాదులను నమ్మి ఇస్తే లీక్ చేశారని.. అందుకే కోర్టు నుంచి తీసుకోమని జైలు అధికారులు చెప్పటం తప్పెలా అవుతుంది? అని ప్రశ్నించారు.
అవినీతి కేసులో ఆధారాలతో సహా దొరికిన వ్యక్తి చంద్రబాబు అంటూ వ్యాఖ్యానించారు సజ్జల.. కేసులోకి వెళ్ళకుండా ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం టీడీపీ నేతలు చేస్తున్నారని విమర్శించారు.. చంద్రబాబు ఆరోగ్యం పేరుతో టీడీపీ నేతలు డ్రామాలు ఆడుతున్నారు.. ఎన్టీఆర్ విషయంలో లక్ష్మీ పార్వతిని అక్రమ వ్యవహారంగా చూపించే కుట్రలో చంద్రబాబు, ఆయన మద్దతుదారులది కీలక పాత్ర పోస్తున్నారని ఎద్దేవా చేశారు.. పిల్లను ఇచ్చిన మామను వెన్నుపోటు పొడిచి ఆయన పార్టీని కబ్జా చేశాడు చంద్రబాబు అంటూ ఆరోపణలు గుప్పించారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.