
చాలామంది పొట్ట ఉండటం షేమ్ గా ఫీలవుతారు. పదిమందిలో పొట్టను పెట్టుకుని తిరగడమంటే ఏదో ఇబ్బంది పడతారు. అయితే ఆ పొట్టన కరిగించడానికి స్లిమ్ కావడం కోసమని తెగ తాపత్రయ పడుతూ ఉంటారు. దానికోసం పడరాని పాట్లు పడుతూ ఉంటారు. తిండి కూడా సరిగ్గా తినకుండా కడుపుని ఎండ కట్టుకుంటూ, జిమ్స్ చుట్టూ ఏరోబిక్స్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అయితే అటువంటి వారు స్లిమ్ కావడం కోసం సమయం, డబ్బులు వృధా చేయాల్సిన అవసరమే లేదు. కేవలం ఒక అరగంట పాటు ఆ పని చేస్తే స్లిమ్ గా మారిపోతారు.
TDP Focus On Bhuvaneshwari: నారా భువనేశ్వరిని పార్టీ కార్యక్రమాల్లో యాక్టివేట్ చేయాలని టీడీపీ నిర్ణయం..
ప్రతిరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ ఒక అర్థగంట సైకిల్ తొక్కితే ఆరోగ్యంగాను, స్లిమ్ గానూ ఉంటారు. సైకిల్ తొక్కడానికి చిన్న పెద్ద తేడా అనేది లేదు. ఎవరైనా సైకిల్ తొక్కవచ్చు. శారీరక, మానసిక అనారోగ్యంతో బాధపడే వారు తప్ప.. మిగతా వారు సైకిల్ ను రెగ్యులర్ గా తొక్కవచ్చు. వయసు, శక్తిని బట్టి ప్రతి వ్యక్తి ప్రతిరోజు ఒక్క అరగంట పాటు సైకిల్ తొక్కితే ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయి. సైక్లింగ్ గుండె, శ్వాసకోశ వ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా.. జీర్ణ వ్యవస్థను సక్రమంగా పని చేస్తుంది. సైక్లింగ్ తో శరీరంలోని రక్తప్రసరణను మెరుగుపరిచి శరీర భాగాలకు సరైన ఆక్సిజన్, పోషకాలను అందించడంలో సహాయపడుతుంది.
Russia: “అణు పరీక్ష నిషేధ ఒప్పందాన్ని” రద్దు చేసుకున్న రష్యా..
అంతేకాకుండా ముఖ్యంగా.. సైక్లింగ్ బరువును నియంత్రించడానికి ఉపయోగపడుతుంది. ఇది శరీరంలోని కొవ్వును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మెదడులోని ప్రాంతాలను సక్రియం చేసి మెదడు పనితీరును మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. తొడలు, తుంటి, ఉదర కండరాలు, భుజాలను బలపరుస్తుంది. సైక్లింగ్ మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సైక్లింగ్ తో మనసుకు శాంతిని, స్థిరత్వాన్ని అందించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. అందువల్ల ప్రతిరోజు క్రమం తప్పకుండా అరగంట పాటు సైక్లింగ్ చేస్తే అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండటమే కాకుండా స్లిమ్ గాను ఉంటారు.
NOTE: ఇంటర్నెట్ లో దొరికిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము.. ప్రయత్నించేముందు.. సంబంధిత నిపుణుల సలహాలు పాటించగలరని మనవి.. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీ తెలుగు. కామ్ బాధ్యత వహించదు..