
ప్రపంచకప్ 2023లో న్యూజిలాండ్ వరుసగా గెలిచి నాలుగో విజయాన్ని నమోదు చేసుకుంది. చెన్నైలోని చెపాక్ వేదికగా ఆఫ్ఘానిస్తాన్ తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను 149 పరుగుల తేడాతో ఓడించింది. టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్లు పటిష్టంగా రాణించారు. అంతేకాకుండా అటు బౌలింగ్ లో కూడా విధ్వంసం సృష్టించి బంగ్లాదేశ్‌ను 139 పరుగులకే ఆలౌట్ చేశారు.
Read Also: Fire Accident: ఢిల్లీలోని ఫర్నీచర్ మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం
ముందుగా బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. అత్యధికంగా గ్లెన్ ఫిలిప్స్ 71 పరుగులు, కెప్టెన్ టామ్ లాథమ్ 68 పరుగులు చేశారు. అటు బౌలింగ్‌లో ఫెర్గూసన్, సాంట్నర్ చెరో 3 వికెట్లు తీశారు. పరుగుల ఛేదనకు వచ్చిన బంగ్లాదేశ్ జట్టు 34.4 ఓవర్లలో ఆలౌటైంది. ఆఫ్ఘాన్ బ్యాటర్లలో కేవలం రహ్మత్ షా మాత్రమే 36 పరుగులు చేశాడు. అజ్మతుల్లా ఒమర్జాయ్ 27, వికెట్ కీపర్ ఇక్రమ్ అలీఖిల్ 19 పరుగులు చేశారు. స్టార్ ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ 11 పరుగుల స్వల్ప స్కోరుకే పెవిలియన్ బాట పట్టాడు.
Read Also: Health Tips: శృంగార శక్తిని పెంచే కూరగాయలేంటో తెలుసా.. తిన్నారంటే..!
ఆఫ్ఘాన్ బ్యాటర్లను కివీస్ బౌలర్లు మొదటి నుంచి ముప్పు తిప్పలు పెడుతూనే ఉన్నారు. తొందర తొందరగా వికెట్లు తీసి కివీస్ బౌలర్లు అద్భుత ప్రదర్శన చూపించారు. న్యూజిలాండ్ తరఫున లాకీ ఫెర్గూసన్, మిచెల్ సాంట్నర్ 3-3 వికెట్లు తీశారు. ట్రెంట్ బౌల్ట్ 2 వికెట్లు తీయగా.. మాట్ హెన్రీ, రచిన్ రవీంద్ర తలో వికెట్ తీశారు.