Leading News Portal in Telugu

Fire Accident: ఢిల్లీలోని ఫర్నీచర్‌ మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం


Fire Accident: ఢిల్లీలోని ఫర్నీచర్‌ మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం

Fire Accident: ఢిల్లీలో కీర్తి నగర్‌లోని ఓ ఫర్నీచర్ షాపు మూడో అంతస్తులో సోమవారం మంటలు చెలరేగాయి. సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. పక్కనే ఉన్న రెండు షోరూమ్‌లకు మంటలు వ్యాపించడంతో అపార నష్టం వాటిల్లడంతో పాటు లక్షల రూపాయల మేర నష్టం వాటిల్లింది.

సమాచారం అందుకున్న వెంటనే 17 అగ్నిమాపక శకటాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు సంభవించలేదు. మంటలు చెలరేగడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అగ్ని ప్రమాదం కారణాలను తెలుసుకోవడానికి తదుపరి విచారణలు జరుగుతున్నాయి.