Leading News Portal in Telugu

Benjamin Netanyahu: మేం చేయగలిగినదంతా చేస్తున్నాం.. కానీ హమాస్ ప్రజల్ని కవచాలుగా వాడుకుంటోంది..


Benjamin Netanyahu: మేం చేయగలిగినదంతా చేస్తున్నాం.. కానీ హమాస్ ప్రజల్ని కవచాలుగా వాడుకుంటోంది..

Benjamin Netanyahu:ఇజ్రాయిల్-హమాస్ యుద్ధ నేపథ్యంలో బుధవారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయిల్ సందర్శించారు. ఇజ్రాయిల్ పీఎం బెంజిమిన్ నెతన్యాహుతో సమావేశమయ్యారు. ఇజ్రాయిల్ కి మద్దతు తెలిపేందుకే, అమెరికా ఇజ్రాయిల్‌కి వెన్నుదన్నుగా నిలిచేందుకే ఇక్కడికి వచ్చానని తెలిపారు. హమాస్‌ ఉగ్రవాదులు ఐసిస్ కన్నా దారుణంగా ఉన్నారని బైడెన్ అన్నారు.

టెల్ అవీవ్ లో బెంజిమిన్ నెతన్యాహు వార్ క్యాబినెట్ ని కలిసిన తర్వాత జో బైడెన్ మాట్లాడారు. ఇజ్రాయిల్ తమ ప్రజల్ని రక్షించుకునేందుకు మీకు మద్దతుగా ఉంటామని, అమాయక ప్రజలకు మరింత విషాదాన్ని నివారించేందుకు మీతో కలిసి, మా భాగస్వాములతో కలిసి పనిచేస్తామని అన్నారు.

ప్రజలను ఈ దాడుల నుంచి సురక్షితంగా ఉంచేందుకు ఇజ్రాయిల్ చేయగల్గిందంతా చేస్తుందని,అయితే కావాలనే హమాస్ పౌరులను కవచాలుగా ఉపయోగించుకోవాలనే ఆశతో టార్గెట్లను దగ్గరా ఉంచుతోందని ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ ఆరోపించారు. మేము సురక్షిత ప్రాంతాలకు వెళ్లాని కోరామని, మీతో కలిసి పనిచేస్తామని, కనీస అవసరాలు తీర్చబడుతాయని జోబైడెన్ తో నెతన్యాహు అన్నారు.

గాజా ఆస్పత్రి దాడి తర్వాత బైడెన్ ఇజ్రాయిల్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ దాడికి ఇజ్రాయిల్ కారణమని హమాస్ ఆరోపిస్తుంటే, ఇస్లామిక్ జిహాద్ జరిపిన రాకెట్ మిస్ ఫైర్ వల్లే ఆస్పత్రిలో పేలుడు సంభవించిందని ఇజ్రాయిల్ సాక్ష్యాలను చూపించింది. ఈ ఆస్పత్రి పేలుడు అరబ్ దేశాల్లో ఆగ్రహావేశాలను ప్రేరేపించాయి. టర్కీ, లెబనాన్, ఇరాన్ వంటి దేశాల్లో ప్రజలు నిరసన కార్యక్రమాలు తెలిపారు.