Leading News Portal in Telugu

Seasonal Flu : నగరంలో పెరుగుతున్న న్యుమోనియా, ఇన్‌ఫ్లుయెంజా కేసులు


Seasonal Flu : నగరంలో పెరుగుతున్న న్యుమోనియా, ఇన్‌ఫ్లుయెంజా కేసులు

నగరంలో న్యుమోనియా, ఇన్‌ఫ్లుయెంజా కేసులు పెరుగుతున్నాయి. ఈ నెలలో ప్రతి రోజూ 1000 మంది రోగులు ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తున్నారు. కండ్లకలక (కంటి ఇన్ఫెక్షన్) కేసులలో ఇటీవలి పెరుగుదల తర్వాత, శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల సంబంధించిన అనేక కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. డెంగ్యూ కేసులు తగ్గుముఖం పడుతుండగా, వైరల్ న్యుమోనియా కేసులు, దగ్గు, జ్వరం, చలి, ఊపిరి ఆడకపోవడం వంటి లక్షణాలతో అధిక సంఖ్యలో కేసులు హైదరాబాద్‌లోని ఆసుపత్రుల్లో నమోదవుతున్నాయి.

అంతేకాకుండా.. కొన్ని బ్యాక్టీరియల్ న్యుమోనియా కేసులు, రోగులు తీవ్రమైన దగ్గు, శ్లేష్మం వారి ఊపిరితిత్తులలో నిండిపోవడం వంటివి కూడా బయటపడుతున్నాయి. రోగులు కడుపు నొప్పి, వాంతులు గురించి కూడా ఫిర్యాదు చేస్తున్నారని, దీనికి ఆసుపత్రి, ఆక్సిజన్ అవసరం ఉండటంతో ప్రభుత్వం ఆసుపత్రుల్లో చేరివారి సంఖ్య పెరుగుతోంది.

దీంతో పాటు.. హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా అక్టోబర్‌లో టైఫాయిడ్ కేసులు భారీగా పెరిగాయి. న్యుమోనియాతో బాధపడుతున్న వారిలో అత్యధికంగా పాతబస్తీ ప్రాంతాల్లోనే ఉన్నారని నీలోఫర్‌ ఆస్పత్రి స్పెషలిస్ట్‌ డాక్టర్‌ దిశితారెడ్డి తెలిపారు. రోగులలో 70 శాతం మంది హైదరాబాద్‌కు చెందిన వారు కాగా, మిగిలిన వారు తెలంగాణలోని ఇతర జిల్లాలకు చెందిన వారు. ప్రస్తుతం దసరా సెలవులతో జనం బారులు సొంతూళ్ల బాట పడుతున్నారు. తిరిగి వచ్చిన తర్వాత కేసులు మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రతిరోజూ దాదాపు 1,000 కేసులు న్యుమోనియా, ఇన్‌ఫ్లుయెంజా ఫిర్యాదులతో ఆసుపత్రులు నిండిపోతున్నాయి.”అని వైద్యులు వెల్లడించారు.

గాంధీ హాస్పిటల్, ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌లో కూడా న్యుమోనియా కేసులు పెరిగాయి, టైఫాయిడ్ మరియు డెంగ్యూ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. గాంధీ ఆసుపత్రి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, రోజూ 30-32 న్యుమోనియా, టైఫాయిడ్ కేసులు నమోదవుతున్నాయి. ఆసుపత్రికి వచ్చే డెంగ్యూ రోగుల సంఖ్య రోజుకు 2-3 కేసులకు తగ్గింది. “ప్రతిరోజూ దాదాపు 50-60 మంది రోగులు టైఫాయిడ్‌తో ఆసుపత్రిని సందర్శిస్తున్నారు, డెంగ్యూ కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి” అని OGH నుండి మరొక వైద్యుడు చెప్పారు. OGH వైద్యుల ప్రకారం, టైఫాయిడ్ కేసులు పెరగడానికి నీటి కలుషితమే మూల కారణం, ఆర్థికంగా వెనుకబడిన నేపథ్యాల నుండి ప్రజలు ఎక్కువగా బాధపడుతున్నారు.