Leading News Portal in Telugu

Congress Bus Yatra Day 2: రాహుల్ కు అనుమతి లేదు.. రేవంత్‌కు మాత్రమే..


Congress Bus Yatra Day 2: రాహుల్ కు అనుమతి లేదు.. రేవంత్‌కు మాత్రమే..

Congress Bus Yatra Day 2: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో మూడు రోజులు బస్సు యాత్రలో భాగంగా జాతీయ స్థాయి నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు 8 నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. రెండో రోజైన ఇవాళ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం‌ మీదుగా ఏఐసీసీ అగ్రనేతలు రాహూల్ గాంధీ, ప్రియాంక గాంధీ విజయభేరి బస్సు యాత్ర నిర్వహించనున్నారు. మేడిపల్లి వద్ద పార్టీ శ్రేణులు స్వాగతం పలకనున్నారు. బైక్ ర్యాలీ ద్వార కాటారం సెంటర్ కి రాహుల్‌ గాంధీ చేరుకొనున్నారు. కాటారం సెంటర్ లో సభలో రాహూల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రసంగించనున్నారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ కే.టి.పీ.పీ గోదావరి గెస్ట్ హౌస్ లో నేడు రేవూరి ప్రకాష్ రెడ్డి తో పాటు మరికొంద మంది రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. అనంతరం బస్సు యాత్ర కేటీకే 5వ గని నుండి బాంబులగడ్డ వరకు బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. కేటికే 1.వ గని వద్ద సింగరేణి కార్మికులతో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గేట్ మీటింగ్ నిర్వహించనున్నారు. అంబేద్కర్ సెంటర్ వద్ద ప్రజలను ఉద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడానున్నారు. సింగరేణి ఒకటో గని గేట్ మీటింగ్ కి రాహుల్ గాంధీకి అనుమతి నిరాకరించడంతో చర్చనీయాంశంగా మారింది. కాగా పీసీసీ చీఫ్ రేవంత్., భట్టి లకు మాత్రమే సింగరేణి ఒకటో గని గేట్ మీటింగ్ కు అనుమతి ఇవ్వడంతో సింగరేణి కార్మికులతో రేవంత్‌, శ్రీధర్ బాబు, పొంగులేటి మాట్లాడనున్నారు. అనంతరం బాంబులగడ్డ వరకు బైక్ ర్యాలీ నిర్వహిస్తారు. కాగా గతంలో టీఆర్‌ఎస్‌ పక్షాన ప్రచారం చేశా నని పొంగులేటి అన్నారు. కానీ సాధించింది ఏం లేదని తెలిపారు. చెప్పిన మాటలు బూటకం అయ్యాయన్నారు. కార్మికులకు ఆదాయ పన్ను తగ్గిస్తామని బీఆర్‌ఎస్‌ చెప్పిందని గుర్తుచేశారు. పైరవి చేస్తున్న వారికే వారసత్వ ఉద్యోగాలు ఇస్తున్నారని మండిపడ్డారు.

నేటి షెడ్యూల్..

* 19వ తేదీన భూపాలపల్లి నుంచి కాటారం కి చేరుకోనున్న బస్సు యాత్ర
* కాటారం పాదయాత్రలో రాహుల్ గాంధీతో పాటు పీసీసీ రేవంత్ రెడ్డిచ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
* మంథని నుంచి పెద్దపల్లి వెళ్లనున్న బస్సు యాత్ర
* పెద్దపల్లి నుంచి కరీంనగర్ కు బస్సు యాత్ర
* కరీంనగర్ లో నైట్ హాల్ట్ చేయనున్న రాహుల్ గాంధీ

20న షెడ్యూల్..

* ఎల్లుండి 20వ తేదీన కరీంనగర్ నుంచి బోధన్ ఆర్మూరు మీదుగా నిజామాబాద్ వరకు కాంగ్రెస్ బస్సు యాత్ర కొనసాగనుంది.
* బోధన్ లో నిజాం షుగర్ ఫ్యాక్టరీని రాహుల్ గాంధీ సందర్శించనున్నారు.
* ఆర్మూరులో కాంగ్రెస్ బహిరంగ సభ జరుగనుంది.
* పసుపు.. చెరుకు రైతులతో రాహుల్ ప్రత్యేకంగా సమావేశం అవుతారు.
* నిజామాబాద్ లో పాదయాత్రలో పాల్గొంటారు. దీంతో 20వ తేదీ సాయంత్రం తో టీ కాంగ్రెస్ బస్సుయాత్ర మొదటి విడత ముగియనుంది.

Mehreen Pirzada: పొట్టి డ్రెస్‌లో థైస్‌ షో చేస్తూ కిల్లింగ్ పోజులు.. వైన్ షాప్ లో హాట్ గా మెహ్రీన్..