
Revanth Reddy: 2017 న సింగరేణి ఫ్రీవేటికరణ బిల్లు వచ్చింది.. అప్పుడు కవిత మద్దతు పలకలేదా? అంటూ కవితపై టీపీసీసీ అద్యక్షుడు రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. సింగరేణి ఓపెన్ కాస్ట్ గని ఎదుట టీ కాంగ్రెస్ నేతలు కార్మికులతో సమావేశమయ్యారు. తెలంగాణ సాధనలో సింగరేణి కార్మికులు కీలకపాత్ర పోషించారని రేవంత్‌రెడ్డి అన్నారు. సింగరేణి కార్మికులు సకల జనుల సమ్మెలో పాల్గొనకపోతే తెలంగాణ వచ్చేదా..? అని ప్రశ్నించారు. సింగరేణి బొగ్గుగని సంగం గౌరవ అధ్యక్షురాలు కవిత అని సంచలన వ్యాఖ్యలు చేశారు. సమస్యలు పరిష్కారం చేయాల్సింది కేసీఆర్.. కానీ.. ఇద్దరు ఒకటే కుటుంబ సభ్యులు అని అన్నారు. ఒకరు ఆడిగినట్టు.. ఇంకొకరు తిట్టినట్టు చేస్తున్నారని మండిపడ్డారు. 8 ఏండ్లుగా సింగరేణికి ఒక్కడే అధికారి కొనసాగుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. గనుల 2017 న సింగరేణి ఫ్రీవేటికరణ బిల్లు వచ్చిందని అన్నారు.
అప్పుడు కవిత మద్దతు పలకలేదా..? లిక్కర్ దోస్తు కి మైన్ ఇవ్వలేదా..? అని రేవంత్ ప్రశ్నించారు. ఆదాయ పన్ను నుండి మినహాయిస్తాము.. పేరు మారుపు.. నిర్ణయాలు తీసుకునే స్థాయిలో శ్రీధర్ బాబు ఉన్నారని అన్నారు. సింగరేణి కార్మికుల హక్కు ఎన్నికలు.. మొండి ఎద్దులెక్క ముడ్డి అడ్డం పెడుతుంది ప్రభుత్వం అని రేవంత్ పైర్ అయ్యారు. కార్మికులు అంతా కాంగ్రెస్ కి అండగా ఉండాలని కోరారు. కార్మికులు ఎన్నికల్లో బల ప్రదర్శన చూపాలని కోరారు. ఎర్రబెల్లి అ ఆ లు కూడా సక్కగా రాయలేదని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన్ని సొంత కులపొడు అని మంత్రిని చేసిండు కేసీఆర్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ 27న సింగరేణి ఎన్నికలు జరగాలంటే డిసెంబర్ 3న కాంగ్రెస్ ప్రభుత్వం రావాలన్నారు. సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కారం చేసే బాధ్యత కాంగ్రెస్ దే అని రేవంత్ హామీ ఇచ్చారు.
రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలు శ్రీధర్ బాబు, మధుయాష్కీ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. సింగరేణిని ప్రయివేటీకరించే కుట్ర జరుగుతోందని, సింగరేణి కార్మికులకు సొంత ఇల్లు ఇచ్చేలా మేనిఫెస్టోలో చేరుస్తామని శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. సింగరేణిలో కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని మరో నేత మధుయాష్కీ అన్నారు. కవిత సింగరేణి గౌరవ అధ్యక్షురాలు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బొగ్గు దోచుకుందని, సారా కుంభకోణం కూడా జోర్రింది కవిత అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అవసరమా ఇలాంటి వాళ్ళు? అని ప్రశ్నించారు.
సింగరేణిలో కాంట్రాక్టు ఉద్యోగుల ఉండరు.. అందరిని రెగ్యులర్ చేస్తామని మధుయాష్కీ హామీ ఇచ్చారు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. గతంలో టీఆర్ఎస్ తరపున ప్రచారం చేసి సాధించిందేమీ లేదన్నారు. టీఆర్ఎస్ మాటలు బూటకమని, సింగరేణిలో ఉద్యోగులు నష్టపోతున్నారని పొంగులేటి మండిపడ్డారు. తెలంగాణ సాధన సందర్భంగా సింగరేణి కార్మికులకు బీఆర్ఎస్ ద్వారా ఇచ్చిన హామీలు బూటకమని పొంగులేటి విమర్శించారు. కార్మికులకు ఆదాయ పన్ను తగ్గిస్తామని చెప్పింది బీఆర్ఎస్ అన్నారు. పైరవి చేస్తున్న వారికే వారసత్వ ఉద్యోగాలు ఇస్తున్నారని మండిపడ్డారు.
Bigg Boss 7 Telugu: గుడ్డు టాస్క్‌లో భళా అనిపించినా జిలేబి పురం బ్యాచ్..