Leading News Portal in Telugu

Sreleela : బాలయ్య సినిమా వదిలేయమని నాకు చాలా మంది చెప్పారు.. కానీ..


Sreleela : బాలయ్య సినిమా వదిలేయమని నాకు చాలా మంది చెప్పారు.. కానీ..

నటసింహం బాలయ్య నటించిన భగవంత్ కేసరి సినిమా నేడు ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. విడుదల అయిన మొదటి షో నుంచే పాజిటీవ్ టాక్ తో దూసుకుపోతోంది.ఈసినిమాలో బాలయ్య ఎంతో కొత్తగా కనిపించారు.సరికొత్త బాలయ్య ను చూసి ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. ఇక ఈ మూవీలో హీరోయిన్ శ్రీలీల బాలయ్య కూతురిగా నటించింది.అయితే శ్రీలీల తాజాగా ఈసినిమాకు సబంధించిన షాకింగ్ విషయాన్ని తెలియజేసింది.. బాలకృష్ణ హోస్ట్ గా.. రీసెంట్ గా అన్ స్టాపబుల్ సీజన్ 3 స్టార్ట్ అయ్యింది. ఈ షోకి ఫస్ట్ గెస్ట్ లు గా భగవంత్ కేసరి టీమ్ నే పిలిచాడు బాలకృష్ణ. అనిల్ రావిపూడితో పాటు. కాజల్ మరియు శ్రీలీల వచ్చి సందడి చేశారు.అయితే ఈ సందర్భంగానే శ్రీలీల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఈసినిమాలో తనను నటించవద్దంటూ చాలా మంది సలహా ఇచ్చారంటూ చెప్పుకొచ్చింది శ్రీలీల.

ఆమెకు కొన్ని ప్రశ్నలు ఎదురవ్వగా.. శ్రీలీల సమాధానం చెబుతూ నేను నటించిన పెళ్లి సందడి సినిమా సమయంలోనే నాకు ఈ సినిమా కథ వినిపించారు. అప్పటికే నాకు హీరోయిన్గా చాలా సినిమాలలో అవకాశాలు వస్తున్నాయి.అలాంటి సమయంలో కూతురి పాత్ర అంటే చాలామంది ఈ సినిమాని ఒప్పుకోవద్దు నో చెప్పు అంటూ నాకు ఎన్నో సలహాలు ఇచ్చారు. కూతురు పాత్ర చేశావో.. హీరోయిన్ గా నీ కెరీయర్ దెబ్బతింటుందని అందుకే ఈ సినిమాను రిజెక్ట్ చేయమని చాలా మంది చెప్పారు. అంటు అసలు విషయం తెలిపింది శ్రీలీల.అయితే హీరోయిన్ గా నేను ఎన్ని సినిమాలైనా చేయవచ్చు కానీ ఇలా కూతురి పాత్రలో నటించే అవకాశాలు ఇక మీదట వస్తాయనే నమ్మకం నాకు లేదు.అందుకే వచ్చిన అవకాశం వదలుకోవద్దు అనుకున్నాను .. అందులోను బాలయ్య కూతురుగా నటించే అవకాశం కాబట్టి కచ్చితంగా ఇలాంటివి సద్వినియోగం చేసుకోవాలి అనుకున్నాను అందుకే ఈ సినిమాకు కమిట్ అయ్యానని శ్రీలీల తెలిపారు.అంతే కాదు ఆమె మరో మాట చెప్పింది ..నేను కెరియర్ పరంగా తీసుకున్న బెస్ట్ నిర్ణయం ఏదైనా ఉంది అంటే ఈ సినిమాకు కమిట్ అవ్వడమే అంటూ శ్రీ లీల చేసిన కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. శ్రీలీల మాటలకు అటు బాలయ్య, డైరెక్టర్ అనిల్ రావిపూడితో పాటు ఫాన్స్ కూడా ఎంతగానో సంతోషిస్తున్నారు.