
Health: మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే స్థూల పోషకాలతో పాటుగా సూక్ష్మ పోషకాలు కూడా చాల అవసరం. సూక్ష్మ పోషకాలల్లో భాగమైన విటమిన్ లు ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. విటమిన్లు తగిన మోతాదులో శరీరానికి అందకపోతే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా బి విటమిన్ లోపం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే బి విటమిన్ లోపం ఉన్నవాళ్ళకి టాబ్లెట్స్ రూపంలో విటమిన్ బి ని సూచిస్తుంటారు వైద్యులు. అయితే అధికంగా విటమిన్ బి టాబ్లెట్స్ వాడడం వల్ల అవి ఆరోగ్యం పైన అనేక దుష్ప్రభావాలను చూపిస్తాయి అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.
Read also:Gold Man: వీడెక్కడి మనిషండి బాబూ.. ఐదు కిలోల బంగారం ధరించి గల్లీ గల్లీ తిరుగుతుండు
ఆ దుష్ప్రభావాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. విటమిన్ బి టాబ్లెట్స్ ని అధికంగా తీసుకోవడం వల్ల తిమ్మిర్లు, ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి, ఎక్కువసేపు నడిచిన, ఎక్కువసేపు కూర్చున్నా, నిల్చున్నా ఎక్కువగా తిమ్మిర్లు వస్తుంటాయి. అలానే విటమిన్ బి ని అధికంగా తీసుకుంటే నిద్ర ఎక్కువగా వస్తుంది. తగినంత నిద్రపోకపోతే ఒత్తిడికి గురవుతారు. ఇది ఆరోగ్యం పైన దుష్ప్రభావాన్ని చూపుతుంది. విటమిన్ బి కాంప్లెక్స్ ఎక్కువగా తీసుకుంటే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్‌లో చర్మ సంబంధిత వ్యాధులు ముఖ్యమైనవి. దురద, దద్దుర్లు రావడం, చర్మం ఎర్రగా మారడం వంటివి తలెత్తుతాయి. అలానే మానసిక వ్యాధులు కూడా తలెత్తుతాయి. కోపం, చిరాకు, ఏడుపు రావడం వంటి లక్షణాలు ఉంటాయి.
NOTE: ఇంటర్నెట్ లో దొరికిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము.. ప్రయత్నించేముందు.. సంబంధిత నిపుణుల సలహాలు పాటించగలరని మనవి.. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీ తెలుగు. కామ్ బాధ్యత వహించదు..