Leading News Portal in Telugu

Team India: టీమిండియాకు బిగ్ షాక్.. మ్యాచ్ మధ్యలో నుండి బయటకు స్టార్ ప్లేయర్


Team India: టీమిండియాకు బిగ్ షాక్.. మ్యాచ్ మధ్యలో నుండి బయటకు స్టార్ ప్లేయర్

వరల్డ్ కప్ 2023లో భాగంగా.. పూణేలో ఇండియా-బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ జట్టు మొదట బ్యాటింగ్ చేస్తోంది. ఈ క్రమంలో టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్లకు దూరమై.. ఆఫ్ఘాన్ తో జరిగిన మ్యాచ్ లో ఓపెనర్ శుభ్ మాన్ గిల్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం టీమిండియా ఫర్ ఫెక్ట్ గా ఉందనుకున్న సమయంలో.. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేస్తూ గాయపడ్డాడు. దీంతో అతను స్టేడియం నుంచి బయటికి వెళ్లిపోయాడు. అయితే దెబ్బ ఎంత తీవ్రంగా ఉందనే దానిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక సమాచారం వెల్లడి కాలేదు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్ వేయడానికి హార్దిక్ పాండ్యా వచ్చాడు. ఈ ఓవర్‌లో అతను కేవలం 3 బంతులు మాత్రమే వేయగలిగాడు. దెబ్బ కారణంగా స్టేడియం నుంచి బయటికి వెళ్లడంతో మిగతా మూడు బాల్స్ ను విరాట్ కోహ్లీ వేసి పూర్తి చేశాడు.

Udaipur Tailor Murder Case: టైలర్ కన్హయ్యలాల్ హత్య కేసు ప్రధాన నిందితుడికి అనారోగ్యం..ఆస్పత్రికి తరలింపు..

ఇక ఇండియా-బంగ్లాదేశ్ మ్యాచ్ లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ జట్టు తొలుత బ్యాటింగ్ చేస్తోంది. బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. బంగ్లాదేశ్‌ రెగ్యులర్‌ కెప్టెన్‌ షకీబ్‌ హసన్‌ ఈ మ్యాచ్‌లో ఆడడం లేదు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌కు శుభారంభం లభించింది. బంగ్లాదేశ్ ఓపెనర్లు తాంజిద్ హసన్, లిటన్ దాస్ తొలి వికెట్‌కు 14.4 ఓవర్లలో 93 పరుగులు జోడించారు. అనంతరం 43 బంతుల్లో 51 పరుగులు చేసి తంజీద్ హసన్ పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఆ తర్వాత నజ్ముల్ హొస్సేన్ శాంతౌ బ్యాటింగ్‌కు వచ్చాడు. కేవలం 8 పరుగులు చేసి రవీంద్ర జడేజా బౌలింగ్ లో ఔటయ్యాడు. ఆ తర్వాత మెహిదీ హాసన్ 3 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. ప్రస్తుతం క్రీజులో లిటన్ దాస్(63), తౌహిద్ హృదయ్ (1)పరుగులతో ఉన్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ స్కోరు 24.3 ఓవర్ల వద్ద 130/3 పరుగులతో ఉన్నారు.

WPL 2024: మహిళల ప్రీమియర్ లీగ్ కోసం జట్లు ఆటగాళ్ల జాబితా విడుదల