Leading News Portal in Telugu

IND vs BAN: భారత్ టార్గెట్ 257.. నాలుగో గెలుపుపై గురి..!



India

IND vs BAN: పూణేలో ఇండియా-బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 256 పరుగులు చేసింది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఓపెనర్లు లిటన్ దాస్, తంజీద్ హాసన్ శుభారంభం అందించారు. వీరిద్దరు అర్థసెంచరీలు చేసి జట్టుకు మంచి ఆరంభాన్ని అందించినప్పటికీ.. ఆ తర్వాత మిడిలార్డర్ బ్యాట్స్ మెన్లు చెతులెత్తేశారు. బంగ్లా బ్యాటింగ్ లో ముష్ఫికర్ రహీం(38), మహ్ముదుల్లా(46) చేసి జట్టుకు కొంత స్కోరును పెంచారు.

Read Also: Congress: సీఎం పదవిపై అశోక్ గెహ్లాట్ కీలక వ్యాఖ్యలు.. టార్గెట్ సచిన్ పైలెటేనా..?

ఇక ఈ మ్యాచ్ లో భారత బౌలర్లు మరోసారి రెచ్చిపోయారు. బుమ్రా, సిరాజ్, రవీంద్ర జడేజా తలో రెండు వికెట్లు తీశారు. శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్ ఒక్కో వికెట్ సాధించారు. మరోవైపు ఈ మ్యాచ్ లో ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా బౌలింగ్ వేస్తూ గాయపడ్డాడు. ఇది టీమిండియాకు బిగ్ షాక్ గా చెప్పవచ్చు. మరికాసేపట్లో ప్రారంభంకానున్న ఇండియా ఇన్నింగ్స్ కు కావాల్సింది 257 పరుగులు. ఈ మ్యాచ్ లో కూడా టీమిండియా గెలిచి నాలుగో విజయాన్ని అందుకోవాలని భావిస్తోంది.

Read Also: Sreesanth: పాకిస్తాన్ టీమ్కు భారత మాజీ బౌలర్ చురకలు.. ఇండియా ‘C’ టీంతో పోలిక