Leading News Portal in Telugu

Batukamma Celebrations: బతుకమ్మ సంబరాల్లో స్టార్ మా సీరియల్ నటులు.. అభిమానులతో కలిసి సందడి.


Batukamma Celebrations: బతుకమ్మ సంబరాల్లో స్టార్ మా సీరియల్ నటులు..  అభిమానులతో కలిసి సందడి.

Batukamma Celebrations: దసరా, బతుకమ్మ పండుగ సంబరాల్లో తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్, స్టార్ మా, సీరియల్ నటులు… తమ అభిమాన ప్రేక్షకులతో కలిసి నగరంలోని వివిధ ప్రాతాలలో దుర్గా పూజా మండపాల వద్దకు సందడి చేశారు. స్టార్ మా ప్రముఖ షోలు “పలుకే బంగారమాయెనా”, “నాగ పంచమి” నుంచి కళాకారులు నిన్న సాయంత్రం నగరంలోని వివిధ ప్రాంతాల్లో తమ అభిమానులతో సంతోషంగా గడపటంతో పాటుగా చిరస్మరణీయ క్షణాలను సృష్టించారు.

ప్రకాశవంతంగా వెలిగిపోతున్న దుర్గా పూజా మండపాల వద్ద బతుకమ్మ ఆడుతూ, పాటలు పాడుతూ, డ్యాన్స్ చేస్తూ, సెల్ఫీలు తీసుకుంటూ, బహుమతులను అందిస్తూ , సమిష్టి స్ఫూర్తిని చాటుతూ కళాకారులు తమ అభిమానులతో ఆనందోత్సాహాలతో గడిపారు. తమ వీక్షకులతో దృఢమైన బంధాన్ని పెంపొందించుకోవడానికి మరియు ప్రతి పండుగను సంతోషకరమైన అనుభూతిగా మార్చడానికి స్టార్ మా కట్టుబడి ఉంది. దసరా, బతుకమ్మ వేడుకల సందర్భంగా తమ కళాకారులను ప్రేక్షకులకు మరింత చేరువ చేసేందుకు ఛానెల్ చేస్తున్న ప్రయత్నం ఐక్యత, వేడుకల యొక్క సంతోషకరమైన క్షణాలను ఆనందంగా గడిపారు.

Batukamma2

Batukamma1

Batukamma