
Chandrababu Arrest: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ వెకేషన్ బెంచ్‌కు బదిలీ అయింది. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ విచారణను వాయిదా వేసిన హైకోర్టు.. దసరా సెలవుల తర్వాతే విచారిస్తామని పేర్కొంది. ఈ నేపథ్యంలో బెయిల్ పిటిషిన్‌పై విచారణను వెకేషన్ బెంచ్‌కు బదిలీ చేయాలని చంద్రబాబు తరఫు లాయర్లు కోరారు. వాదనల అనంతరం చంద్రబాబు లాయర్ల అభ్యర్థనకు హైకోర్టు అంగీకరించింది. ఈ క్రమంలో బెయిల్ పిటిషన్‌పై విచారణను దసరా సెలవుల్లో హైకోర్టు వెకేషన్ బెంచ్ చేపట్టనుంది. అదే సమయంలో.. చంద్రబాబు వ్యక్తిగత డాక్టర్‌తో వైద్య పరీక్షలకు హైకోర్టు అనుమతిచ్చింది.
టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై గురువారం ఏపీ హైకోర్టులో విచారణ జరగగా.. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోర్టును ఆయన తరఫు లాయర్ సిదదార్థ లూథ్రా కోర్టును కోరారు. ఈ కేసులో ఇతర నిందితులు బెయిల్‌పై ఉన్నారని.. గడిచిన 40 రోజుల్లో దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేదని పేర్కొన్నారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మధ్యంతర బెయిల్ ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవడానికి సమయం ఇవ్వాలని న్యాయస్థానాన్ని అడిషనల్ అడ్వకేట్ జనరల్ కోరారు. వాదనలు విన్న ఏపీ హైకోర్టు విచారణను వెకేషన్ బెంచ్‌కు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.