Leading News Portal in Telugu

Pakistan Team: బెంగళూరు పేలుడుపై పాకిస్థాన్ మీడియా తప్పుడు ప్రచారం


Pakistan Team: బెంగళూరు పేలుడుపై పాకిస్థాన్ మీడియా తప్పుడు ప్రచారం

పాకిస్తాన్ జట్టు తన నాలుగో మ్యాచ్‌ను ఆదివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియాతో ఆడనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్ మీడియా తప్పుడు వార్తలను ప్రచారం చేసింది. బెంగుళూరులో జరిగిన పేలుడు ఘటనపై పాకిస్తాన్ జట్టు భద్రతపై ఆందోళన చెందాల్సి ఉందని తెలిపింది. దీంతో బెంగుళూరులో నిజంగా పేలుడు జరిగిందా.. పాకిస్తాన్ జట్టు భద్రతకు ఏదైనా ముప్పు ఉందా అనే ప్రశ్నలు తలెత్తాయి.

మీడియా నివేదికల ప్రకారం.. బెంగుళూరులోని కోరమంగళ ప్రాంతంలో సిలిండర్ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో కొంతమందికి గాయాలైనట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంపై పాకిస్తాన్ జర్నలిస్టులు నేరుగా పాకిస్తాన్ క్రికెట్ జట్టు భద్రతకు లింక్ చేసి X ద్వారా వ్యతిరేక ట్వీట్ చేశారు. ఇది ఉగ్రవాద దాడి లేదా బాంబు పేలుడు కాదని.. కేవలం సిలిండర్ పేలుడు వల్లనే మంటలు చెలరేగాయని మొదటి నుండి స్పష్టంగా తెలిసినప్పటికీ, పాకిస్తాన్‌కు చెందిన కొంతమంది జర్నలిస్టులు కూడా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

రేపు బెంగళూరులో జరిగే ఐసీసీ ప్రపంచకప్ 2023లో తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో పాకిస్థాన్ తలపడనుంది. ఆస్ట్రేలియా మూడు మ్యాచ్‌లు ఆడి.. ఒక విజయాన్ని నమోదు చేసుకుంది. దీంతో పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో కొనసాగుతుంది. అయితే రేపటి మ్యాచ్ ఆసీస్ జట్టుకు ఇది కీలకం. ఇదిలా ఉంటే.. ఇండియాతో 7 వికెట్ల తేడాతో ఓడిపోయిన పాకిస్థాన్ మళ్లీ పుంజుకోవాలని చూస్తోంది. పాయింట్ల పట్టికలో మెన్ ఇన్ గ్రీన్ నాలుగో స్థానంలో ఉన్నారు.