Leading News Portal in Telugu

First Liplock Movie: స్వాతంత్ర్యం రాకముందే 4నిమిషాల పాటు లిప్ లాక్ సీన్ ఉన్న సినిమా ఏంటో తెలుసా?


First Liplock Movie: స్వాతంత్ర్యం రాకముందే 4నిమిషాల పాటు లిప్ లాక్ సీన్ ఉన్న సినిమా ఏంటో తెలుసా?

First Liplock Movie: లిప్‌లాక్ సీన్లు ఇప్పుడు మామూలే. అసలు ముద్దులేకుండా సినిమాలు రావడమే కష్టంగా మారింది. కథ లేని సినిమాలు వచ్చినా.. ముద్దులు లేకుండా సినిమాలు తీయడం మరిచిపోయారు దర్శకులు. బాలీవుడ్‌లో ఏ సినిమా అయినా కనీసం ఒక్క ముద్దు సన్నివేశమైనా ఉండాలి. నేటి హీరో, హీరోయిన్లు అసలు లిప్ లాక్ సీన్ల గురించి పట్టించుకోవడం లేదు. అది కూడా నటనలో భాగమే అంటున్నారు. అయితే ఒకప్పుడు అలా ఉండేది కాదు. ముద్దు సన్నివేశాలు బూతుతో సమానం. తెరపై ముద్దుల సీన్లు చూస్తే.. వామ్మో అని అనుకుంటారు.

సినిమాల్లో వరుస ముద్దులతో రెచ్చిపోయే ఇమ్రాన్ హష్మీ, రణదీప్ హుడా లాంటి హీరోలను చూసి పోర్న్ స్టార్స్ అనేవాళ్లు ప్రేక్షకులు. అయితే ఇప్పుడు అలా కాదు.. ఇప్పుడు లిప్‌లాక్ అనేది సాధారణ ముద్దు మాత్రమే. హీరో, హీరోయిన్లు కూడా మాటల్లో చెప్పలేని భావాలన్నీ ముద్దుతో చెప్పగలరని అంటున్నారు. తెలుగులోనూ లిప్‌లాక్‌లు సర్వసాధారణమైపోయాయి. అయితే ఒక్కసారి ఊహించుకోండి.. స్వాతంత్య్రానికి ముందు అది కూడా ఓ భారతీయ సినిమాలో లిప్ లాక్ సీన్ షూట్ చేశారు.. అసలు అది ఎలా సాధ్యమైందని అనుకుంటున్నారా..?

దాదాపు 87 ఏళ్ల క్రితం భారతీయ సినిమాలో తొలి లిప్‌లాక్ సన్నివేశం చిత్రీకరించబడింది. 1933లో మొదటి తరం బాలీవుడ్ హీరోయిన్ దేవికారాణి కర్మ అనే హిందీ చిత్రం కోసం ముద్దు సన్నివేశంలో నటించింది. అయితే ఆ సీన్‌లో ఉన్నది ఆమె భర్త హిమాన్షు రాయ్. అయితే ఈ సీన్ విషయంలో అప్పట్లో దేవికపై చాలా విమర్శలు వచ్చాయి. వారు భారతదేశాన్ని అవమానించారని… ఆచార వ్యవహారాలకు నిప్పు అంటిస్తున్నారని దుమ్మెత్తిపోశారు. అయితే ఇప్పుడు మాత్రం అదే లిప్‌లాక్ సర్వసాధారణంగా మారింది.