Leading News Portal in Telugu

LEO : లియో ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే..?


LEO : లియో ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే..?

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ గత ఏడాది విక్రమ్ వంటి సాలిడ్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.తాజాగా ఈ దర్శకుడు తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ లియో.కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి  హీరోగా త్రిష కృష్ణన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు మొదటి నుంచే భారీ బజ్ క్రియేట్ అయింది.దీంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో గురువారం థియేటర్లలోకి వచ్చేసింది లియో సినిమా.విజయ్ లియో సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో రూ. 16 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దీంతో రూ. 17 కోట్ల షేర్ కలెక్షన్స్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్ అయింది. ఇక లియోకు తమిళనాడులో రూ. 100 కోట్లు, కర్ణాటకలో రూ. 15.50 కోట్లు, కేరళలో రూ. 13.50 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 10 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 60 కోట్ల మార్కెట్ అయింది. దీంతో వరల్డ్ వైడ్‌గా లియోకు రూ. 215 కోట్ల భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.లియో సినిమాకు రూ. 216 కోట్ల షేర్, రూ. 410 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ పోటీకి సిద్ధమైంది.

లియో సినిమా వరల్డ్ వైడ్‌గా 2800కుపైగా థియేటర్లలో విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా దాదాపు 500 వరకు థియేటర్లలో రిలీజైంది. కాగా, లియో మూవీకి సుమారు రూ. 300 కోట్ల బడ్జెట్ అయినట్లు సమాచారం. ఈ సినిమాకు మొదటి రోజు రూ. 150 కోట్ల వరకు బుకింగ్స్ జరిగినట్లు సమాచారం.తెలుగు రాష్ట్రాల్లో లియో సినిమాకు తొలి రోజున బుకింగ్స్ బట్టి రూ. 17 కోట్ల రేంజ్‌ గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం.అలాగే తమిళనాడులో రూ. 32 కోట్లు, కేరళలో రూ. 12.50 కోట్లు, కర్ణాటకలో రూ. 14.50 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 4 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఇలా మొత్తంగా ఇండియాలో రూ. 80 కోట్ల గ్రాస్ వచ్చినట్లు తెలుస్తుంది.. ఇక ఓవర్సీస్‌లో రూ. 65 కోట్లతో కలిపి వరల్డ్ వైడ్‌గా రూ. 145 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం.లియో సినిమాతో విజయ్ మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. లియో సినిమాలో విజయ్ పెర్ఫార్మన్స్ కు భారీ రెస్పాన్స్ వస్తుంది. డైరెక్టర్ లోకేష్ టేకింగ్ కు ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి ఈ సినిమా ముందు ముందు ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.