Leading News Portal in Telugu

Virender Sehwag: 45వ పుట్టినరోజు జరుపుకుంటున్న నజఫ్గడ్ నవాబ్.. సెహ్వాగ్ గురించి ఈ విషయాలు తెలుసా..?


Virender Sehwag: 45వ పుట్టినరోజు జరుపుకుంటున్న నజఫ్గడ్ నవాబ్.. సెహ్వాగ్ గురించి ఈ విషయాలు తెలుసా..?

భారత క్రికెట్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఓపెనర్ గా గుర్తింపు పొందిన వీరేంద్ర సెహ్వాగ్  (జననం 20 అక్టోబరు 1978)ఇవాళ 45 వ బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. తన మెరుపు బ్యాటింగ్ తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ముఖ్యంగా 1990స్ లో పుట్టిన పిల్లలకు సెహ్వాగ్ అంటే పిచ్చి అనే చెప్పాలి. అతడు బ్యాటింగ్ లో ఉన్నంతసేపు టీవీ చూసి అనంతరం టీవీ కట్టేసే అభిమానులు చాలా మంది ఉన్నారు. క్రీజులో ఉంటే ప్రత్యర్థి బౌలర్ ఎవరనేది లెక్కచేయకుండా వీర బాదుడు బాదే వీరేంద్రుడికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు.

అత్యంత విధ్వంసక ఓపెనర్‌లలో ఒకరిగా మరియు అతని కాలంలోని గొప్ప బ్యాట్స్‌మన్‌లలో ఒకరిగా  పరిగణించబడ్డాడు, భారత దేశవాళీ క్రికెట్‌లో హర్యానాలో. అతను 1999లో తన మొదటి వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ పాకిస్తాన్తో ఆడాడు. 2001లో భారత టెస్ట్ జట్టులో చేరాడు. ఏప్రిల్ 2009లో, సెహ్వాగ్ 2008లో తన ప్రదర్శనకు ప్రపంచంలోని విస్డెన్ లీడింగ్ క్రికెటర్‌గా గౌరవించబడిన మొదటి భారతీయుడు అయ్యాడు, ఆ తర్వాత 2009లో అవార్డును నిలుపుకున్న మొదటి ఆటగాడిగా నిలిచాడు. సెహ్వాగ్ భారతదేశంతో ఉన్న సమయంలో, 2002 ICC ఛాంపియన్స్ ట్రోఫీ, 2007 T20 ప్రపంచ కప్ విజేతలు మరియు 2011 క్రికెట్ ప్రపంచ కప్ విజేతలలో ఒకరిగా ఉన్న జట్టులో సభ్యుడు. 2002 ICC ఛాంపియన్స్ ట్రోఫీలో సెహ్వాగ్ 271 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

సెహ్వాగ్ 251 వన్డే మ్యాచ్ లు ఆడగా అందులో 15 సెంచరీలో 38 అర్థసెంచరీలు కొట్టాడు 104 టెస్ట్ మ్యాచ్ లు ఆడి 23 సెంచరీలు ముప్పై రెండు అర్థ సెంచరీలు కొట్టాడు.సెహ్వాగ్ కెరీర్‌లో అత్యంత విశేషమైన అంశం ఏమిటంటే, ఉత్కంఠభరితమైన వేగంతో భారీ స్కోర్‌లను నిర్మించగల అతని సామర్థ్యం.అతను అత్యధిక టెస్ట్ డబుల్ సెంచరీలు చేసిన భారత రికార్డును కలిగి ఉన్నాడు మరియు మూడు ట్రిపుల్ సెంచరీలు చేసిన మొదటి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.ఆడేది టెస్ట్ మ్యాచ్ అయినా వన్డే మ్యాచ్ అయినా బౌలర్స్ కి చుక్కలు చూపించడం మాత్రం పక్కా ఆరెంజ్ లో బౌలర్స్ర్ ను ఉతికి ఆరేసే వాడు.అవార్డ్స్ విషయానికొస్తే అర్జున అవార్డు, పద్మశ్రీ అవార్డు అందుకున్నాడు ఇక 2004లో తన ఫ్రెండ్ అయినా ఆర్తి అహ్లావత్ని ప్రేమించి వివాహం చేసుకున్నాడు వీరికి ఇద్దరు కుమారులు. 2015 అక్టోబర్ 20న అంతర్జాతీయ క్రికెట్ కి గుడ్ బై చెప్పాడు వీరేంద్ర సెహ్వాగ్…