Leading News Portal in Telugu

Rakshit Shetty: మూడు వారాల వెనక్కి వెళ్లిన కల్ట్ సినిమా…


Rakshit Shetty: మూడు వారాల వెనక్కి వెళ్లిన కల్ట్ సినిమా…

రక్షిత్ శెట్టి… ఈ పేరు వినగానే తెలుగు ఆడియన్స్ కి అతడే శ్రీమన్నారాయణ, 777 చార్లీ లాంటి సినిమాలు గుర్తొస్తాయి. కర్ణాటక రీజనల్ మార్కెట్ నుంచి పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకునే వరకూ రక్షిత్ తన కెరీర్ ని స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకున్నాడు. కర్ణాటక రాష్ట్ర హద్దులు దాటి పాన్ ఇండియా రేంజ్ సినిమాలు చేస్తున్నాడు. క్వాలిటీ ఉండే సినిమాలని, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలని మాత్రమే చేసే రక్షిత్ శెట్టి… లేటెస్ట్ గా ‘సప్త సాగర దాచే ఎల్లో సైడ్ A’ సినిమా చేసాడు. రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కన్నడలో సూపర్ హిట్ అయ్యి… అక్కడి నుంచి తెలుగులోకి డబ్ అయ్యి ఇక్కడ కూడా రిలీజ్ అయ్యింది. తెలుగులో సప్త సాగరాలు దాటి సైడ్ A అనే టైటిల్ తో రిలీజ్ అయినాఈ మూవీ ఇక్కడ మొదటి రోజే బ్రేక్ అయ్యింది. మంచి కలెక్షన్స్ ని రాబట్టిన ఈ సినిమా ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయ్యి ఓటీటీలో ట్రెండ్ అవుతోంది.

యూత్ రిపీట్ మోడ్ లో చూస్తున్న సప్త సాగరాలు దాటి సైడ్ A మాయలో నుంచి బయటకి రాకముందే… సప్త సాగరాలు దాటి సైడ్ Bని వదులుతున్నారు. మను అండ్ ప్రియాల ప్రేమకథగా తెరకెక్కిన ఈ మూవీ సీక్వెల్ అక్టోబర్ 27న రిలీజ్ అవుతున్నట్లు రక్షిత్ శెట్టి ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ చేసాడు. అయితే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం సప్త సాగరాలు దాటి సైడ్ B సినిమా మూడు వారాలు వాయిదా పడింది. అక్టోబర్ 27 నుంచి నవంబర్ 17కి ఈ సీక్వెల్ పోస్ట్ పోన్ అయ్యింది. అయితే సైడ్ Aని ముందు కన్నడలో రిలీజ్ చేసి ఆ తర్వాత తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేసారు… సైడ్ Bని మాత్రం ఒకేసారి రిలీజ్ చేయనున్నారు. పార్ట్ 1 కన్నా కొంచెం ఎక్కువగా పార్ట్ 2ని ప్రమోట్ చేస్తే చాలు ఆల్రెడీ పాజిటివ్ బజ్ ఉంది కాబట్టి నవంబర్ 17న రక్షిత్ శెట్టి ఖాతాలో మరో సూపర్ హిట్ పడినట్లే.