Leading News Portal in Telugu

OnePlus Open Launch: వనప్లస్‌ ఓపెన్‌ వచ్చేసింది.. ధర, ఫీచర్స్ ఇవే!


OnePlus Open Launch: వనప్లస్‌ ఓపెన్‌ వచ్చేసింది.. ధర, ఫీచర్స్ ఇవే!

OnePlus Open Foldable SmartPhoneLaunch and Price in India: ‘వన్‌ప్లస్‌’ తమ తొలి ఫోల్డబుల్‌ ఫోన్‌ను విడుదల చేసింది. వనప్లస్‌ ఓపెన్‌ భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఈ ఫోన్‌ ధర భారత్‌లో రూ. 1,39,999గా ఉంది. వనప్లస్‌ ఓపెన్‌ ఫోన్‌ క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 2 ప్రాసెసర్‌తో వస్తోంది. ఫోన్ లోపలి భాగంలో 7.82 అంగుళాల స్క్రీన్‌ ఉంటుంది. ఇందులో 4,800 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ ఉంది. వనప్లస్‌ ఓపెన్‌ ఫోన్ ఫీచర్లను ఓసారి చూద్దాం.

OnePlus Open Price:
వన్‌ప్లస్‌ ఓపెన్‌ ఫోన్ 16జీబీ ర్యామ్‌, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ ధర భారత్‌లో రూ.1,39,999గా ఉంది. ఎమరాల్డ్‌ డెస్క్‌, వాయేజర్‌ బ్లాక్‌ రంగుల్లో అందుబాటులో ఉంది. వన్‌ప్లస్‌ అధికారిక వెబ్‌సైట్‌, అమెజాన్‌ రిటైల్‌ స్టోర్లలో విక్రయానికి అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ప్రీ ఆర్డర్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అక్టోబర్‌ 27 నుంచి విక్రయానికి వస్తాయి. రూ. 8,000 వరకు ఎక్స్‌ఛేంజ్‌రాయితీ.. ఐసీఐసీఐ కార్డు, వన్‌కార్డ్‌ ద్వారా రూ.5,000 డిస్కౌంట్‌ కూడా లభిస్తుంది.

OnePlus Open Display:
వన్‌ప్లస్‌ ఓపెన్‌లో డ్యుయల్‌ సిమ్‌ ఉంటుంది. ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత ఆక్సిజన్ఓస్‌ 13.2తో ఇది వస్తోంది. లోపలి భాగంలో 7.82 అంగుళాల (2,268×2,440 pixels) 2కే ఫ్లెక్సీ- ఫ్లుయిడ్‌ ఎల్‌టీపీఓ 3.0 అమోలెడ్‌ స్క్రీన్‌ ఉండగా.. ఇది 1-120Hz డైనమిక్‌ రీఫ్రెష్‌ రేట్‌, 240Hz టచ్‌ రెస్పాన్స్‌ రేట్‌, 2,800 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌తో పనిచేస్తుంది. వెలుపలి భాగంలో 6.31 అంగుళాల (1,116×2,484 pixels) 2కే ఎల్‌టీపీఓ 3.0 సూపర్‌ ఫ్లుయిడ్‌ అమోలెడ్‌ స్క్రీన్‌ ఉంటుంది. ఇది 10-120Hz డైనమిక్‌ రీఫ్రెష్‌ రేట్‌, 240Hz టచ్‌ రెస్పాన్స్‌ రేట్‌, 2,800 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌తో వస్తోంది.ఇందులో క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 జనరేషన్‌ 2 ప్రాసెసర్‌ ఉంది.

OnePlus Open Camera:
వన్‌ప్లస్‌ ఓపెన్‌ వెనుకభాగంలో మూడు కెమెరాలతో కూడిన సెటప్‌ ఉంది. 48 మెగాపిక్సెల్‌ ప్రధాన కెమెరాతో పాటు 1/1.43 అంగుళాల సోనీ LYT-T808 సీఎంఓఎస్‌ సెన్సార్‌, f/1.7 ఎపర్చర్ ఉంది. 64 మెగా పిక్సెల్‌ టెలిఫొటో కెమెరా ఉంది. సెల్ఫీల కోసం లోపలి స్క్రీన్‌పై 20 మెగాపిక్సెల్‌, బయటి స్క్రీన్‌పై 32 మెగాపిక్సెల్‌ కెమెరాలు ఉన్నాయి.

OnePlus Open Battery:
వన్‌ప్లస్‌ ఓపెన్‌లో 4,800 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ ఉంది. ఇది 67W SuperVOOC ఛార్జింగ్‌ సపోర్ట్‌కు మద్దతు ఇస్తుంది. ఇందులో 5G, 4G LTE, వైఫై 7, బ్లూటూత్‌ 5.3, జీపీఎస్‌, ఎన్‌ఎఫ్‌సీ, గెలీలియో, క్యూజెడ్‌ఎస్‌ఎస్‌, యూఎస్‌బీ 3.1 ఫీచర్లు ఉన్నాయి.