Leading News Portal in Telugu

Minister KTR : బీఆర్ఎస్ ఎవరికీ బీ టీం కాదు.. తెలంగాణ కు ఏ టీం..


Minister KTR : బీఆర్ఎస్ ఎవరికీ బీ టీం కాదు.. తెలంగాణ కు ఏ టీం..

మంత్రి కేటీఆర్‌ సమక్షంలో జిట్టా బాలకృష్ణారెడ్డి, మామిళ్ల రాజేందర్‌ బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా జిట్టాకు మంత్రి కేటీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌మాట్లాడుతూ.. బాలకృష్ణారెడ్డి దారి తప్పిన కొడుకు తిరిగి ఇంటికి వచ్చినట్టు ఉందన్నారు. డబ్బు సంచులతో పట్టుబడ్డ రేవంత్ రెడ్డి కేసీఆర్ ను గన్ పార్కు దగ్గరకు రమ్మని సవాల్ చేస్తున్నారని, నవ్వాలా సావాలా అర్ధం కావడం లేదన్నారు. అమర వీరులుగా మార్చిన వారే అమరవీరుల స్థూపం దగ్గరకు రమ్మంటారని, బీ ఆర్ ఎస్ ఎవ్వరికీ బీ టీం కాదు ..తెలంగాణ కు ఏ టీం ..అవ్వల్ దర్జా టీం అంటూ మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

అంతేకాకుండా.. ‘..రేవంత్ ఆనాడు సోనియా ను బలి దేవత అన్నాడు ..ఇపుడు కాళీ దేవత అంటున్నాడు… రేవంత్ ఆనాడు రాహుల్ ను ముద్ద పప్పు అన్నాడు ..ఈనాడు నిప్పు అంటున్నాడు.. రేవంత్ మారినప్పుడల్లా మనం మారాలా.? బీసీ ల జనగణన పై రాహుల్ ఇప్పుడు మాట్లాడుతున్నారు. తొమ్మిది నెలల క్రితం మేము బీసీ జన గణన చేయాలని మేము అసెంబ్లీ లో తీర్మానం చేసి పంపాము. రాహుల్ కు ఇపుడు బీసీ గణన గుర్తుకొచ్చింది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో బీసీ గణన ఎందుకు చేయలేదు? ..ఇందిరమ్మ రాజ్యం తెస్తామంటున్నారు ..ఎమర్జెన్సీ రోజులు తెస్తారా ? …మోడీ ని బీజేపీ వాళ్ళు దేవుడు అంటున్నారు ..మోడీ ఫోటో ఇంట్లో పెట్టుకొండి ఇష్టముంటే ?…సిలిండర్ ధర పెంచినందుకు మోడీ దేవుడా ? …తెలంగాణ ను ఆగం చేయాలనే వారి కుట్రను భగ్నం చేయాలి.. వచ్చే 40 రోజులు చాలా కీలకం. కాంగ్రెస్ కు ఐదారుగురు సీఎం అభ్యర్థులు దొరికారు కానీ ఓటర్లు దొరకలేదు. మళ్ళీ కేసీఆర్ యే సీఎం అవుతారు ..ఎవ్వరూ రంధి పెట్టుకోవద్దు.’ అని మంత్రి కేటీఆర్‌ అన్నారు.