Leading News Portal in Telugu

Irfan Pathan: షాహీన్ అఫ్రిదిపై టీమిండియా మాజీ క్రికెటర్ ప్రశంసలు


Irfan Pathan: షాహీన్ అఫ్రిదిపై టీమిండియా మాజీ క్రికెటర్ ప్రశంసలు

ప్రపంచకప్ 2023లో భాగంగా.. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ స్టార్ బౌలర్ రెచ్చిపోయాడు. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో షాహీన్ షా ఆఫ్రిది 5 వికెట్లు తీశాడు. ఒకవైపు ఈ ఫ్లాట్ వికెట్‌పై పాక్ బౌలర్లు చాలా పరుగులు సమర్పించుకుంటే.. కేవలం షాహీన్ మాత్రం అద్భుతంగా బౌలింగ్ చేసి కంగారలను మట్టికరిపించాడు. దీంతో షాహీన్ అఫ్రిదీ బౌలింగ్ పై భారత మాజీ దిగ్గజం ఇర్ఫాన్ పఠాన్‌తో పాటు పలువురు ప్రశంసల జల్లు కురిపించారు.

AUS vs PAK: పాకిస్తాన్పై ఆస్ట్రేలియా ఘన విజయం.. పాయింట్ల పట్టికలో భారీ మార్పులు

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 367 పరుగులు చేసింది. ఇందులో షాహీన్ ఆఫ్రిది 10 ఓవర్లలో 5.40 ఎకానమీ వద్ద 54 పరుగులు ఇచ్చి ఐదుగురిని ఔట్ చేశాడు. డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ భాగస్వామ్యాన్ని షాహీన్ బ్రేక్ చేశాడు. అంతేకాకుండా మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్‌లను ఔట్ చేశాడు.

Karthika : రంగం భామ ఎంగేజ్మెంట్..? వైరల్ అవుతున్న పిక్స్..

షాహీన్ అద్భుత ప్రదర్శనపై భారత మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ‘X’లో ఇలా వ్రాశాడు. “బెంగళూరులోని ఈ ఫ్లాట్ పిచ్‌పై షాహీన్ 5 వికెట్లు తీయడం గొప్ప అని చెప్పుకొచ్చాడు. కేవలం షాహీన్ తప్ప.. మిగతా బౌలర్లు ఫెయిలయ్యారని విమర్శించాడు. మిగతా నెటిజన్లు కూడా స్పందించారు. “ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియాపై షాహీన్ అఫ్రిది 5 వికెట్లు పడగొట్టాడు. చిన్నస్వామిలో డేగ అని రాసుకొచ్చారు. అటు పాకిస్థాన్ మాజీ బ్యాట్స్‌మెన్ మహ్మద్ హఫీజ్ కూడా షాహీన్‌పై ప్రశంసలు కురిపించాడు.

Anil Ravipudi: ఈ సినిమాతో బాలయ్య మరింత ఎత్తుకు ఎదిగారు

షాహీన్ ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడాడు. తొలి మూడు మ్యాచ్‌ల్లో 4 వికెట్లు మాత్రమే తీశాడు. ఇప్పుడు ఆస్ట్రేలియాపై 5 వికెట్లు తీయడంతో వికెట్ల సంఖ్య 9కి చేరుకుంది. 4 మ్యాచ్‌ల్లో 21.44 సగటుతో 9 వికెట్లతో.. టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన ఉమ్మడి మూడో బౌలర్‌గా షాహీన్ నిలిచాడు. న్యూజిలాండ్‌కు చెందిన మాట్ హెన్రీ కూడా 4 మ్యాచ్‌ల్లో 9 వికెట్లు పడగొట్టాడు. న్యూజిలాండ్ స్పిన్నర్ మిచెల్ సాంట్నర్ 11 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.