Leading News Portal in Telugu

CM KCR : గజ్వేల్ నియోజకవర్గానికి ప్రతినెలా ప్రత్యేక శ్రద్ధ వహిస్తా


CM KCR : గజ్వేల్ నియోజకవర్గానికి ప్రతినెలా ప్రత్యేక శ్రద్ధ వహిస్తా

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భరత పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించి అధికారంలోకి వస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తూంకుంటలోని కన్వెన్షన్ హాలులో గజ్వేల్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ నాయకులతో ఆయన సమావేశమయ్యారు. 95 నుంచి 100 అసెంబ్లీ సీట్లు గెలుస్తామని కేసీఆర్ ప్రకటించారు. గజ్వేల్ నియోజకవర్గానికి ప్రతినెలా ప్రత్యేక శ్రద్ధ వహిస్తానని, నియోజకవర్గంలో బహుళ అభ్యర్థులు ఉండాలన్నదే తన ధ్యేయమని ఉద్ఘాటించారు. గజ్వేల్‌లో జరిగిన అభివృద్ధి పనులను గుర్తించిన కేసీఆర్ ఇంకా చేయాల్సింది చాలా ఉందని పేర్కొన్నారు. గజ్వేల్‌ను వదలబోనని, ఆదరిస్తున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తాను ప్రతినెలా గజ్వేల్‌లో వస్తానని చెప్పిన కేసీఆర్.. గజ్వేల్‌లో తన మెజారిటీపై ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు.

నాడు ఎన్నిక‌లు రాగానే.. రాయ‌ల‌సీమ‌, ఉత్త‌రాంధ్ర‌కు టికెట్లు ముందు ఇచ్చేవార‌ని కేసీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ ద‌గ్గ‌ర ఉంట‌దనే నెపంతో లాస్ట్‌కు ఇచ్చేవారు. ఓ ఎల‌క్ష‌న్ల మా నాన్న చ‌నిపోతే నేను టికెట్ కోసం పోలేదు. అప్పుడు ముఖ్య‌మంత్రి ఎన్టీ రామారావు. మీ టికెట్ ఫైన‌ల్ అయిందంట‌.. వచ్చి ఫారాలు తీసుకొని వెళ్ల‌మ‌ని ఫోన్ కాల్ వ‌చ్చింద‌ని డీఎస్పీ వ‌చ్చి నాకు చెప్పిండు. తెల్లార‌గానే హైద‌రాబాద్ వ‌చ్చాను.. నాచారం స్టూడియోలో ఫారాలు ఇస్తున్నారంటే అక్క‌డికి వెళ్లాను. అక్క‌డ అంద‌రు తెలంగాణ వారే ఉన్నారు. రాష్ట్ర స్థాయి నాయ‌కులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. దేవుడి మెట్ల వ‌ద్ద బిచ్చ‌గాళ్లు కూర్చున్న‌ట్టు కూర్చున్న‌రు. చాలా బాధ క‌లిగింది. ఇది ఏం ప‌ద్ధ‌తి అని.. టెంటు వేసి నాలుగు కుర్చీలు వ‌స్తే.. స‌రిపోయేది క‌దా అని అనుకున్నాను. సేం బిచ్చ‌గాళ్ల సీనే క‌నిపింద‌ని కేసీఆర్ తెలిపారు.