
Tammy Hurricane: శుక్రవారం అర్ధరాత్రి ఫ్రెంచ్ కరేబియన్ ద్వీపం గ్వాడెలోప్‌లో తుఫాను కారణంగా రెడ్ అలర్ట్ ప్రకటించింది. హరికేన్ శనివారం పగటిపూట గ్వాడెలోప్ ద్వీపసమూహం సమీపంలో లేదా దాని మీదుగా వెళుతుందని అలానే దీని మార్గం రాత్రి సమయంలో సమీపంలోని సెయింట్-మార్టిన్ మరియు సెయింట్-బార్తెలెమీ దీవుల నుండి దూరం వెళ్లే అవకాశం ఉందని ఫ్రెంచ్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. దీని కారణంగా భారీ వర్షపాతంతో పాటుగా బలమైన గాలులు వీస్తాయని సూచించింది. గంటకు 120 కిలోమీటర్లు నుండి 148 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని ఫ్రెంచ్ వాతావరణ సూచన మేటియో-ఫ్రాన్స్ అంచనా వేసింది. కాగా ఈ తుఫానుకు టామీ హరికేన్ అనే పేరు పెట్టారు. ఈ తుఫాను తీవ్రత తార స్థాయిలో ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేసింది ఫ్రెంచ్ వాతావరణ శాఖా మేటియో-ఫ్రాన్స్. ఈ నేపథ్యంలో అధికారులు మాట్లాడుతూ రాబోయే తుఫాను తీవ్రత తార స్థాయిలో ఉంటుందని.. కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.
Read also:Israel-Hamas War: ఆ ఇద్దరిని వదిలిపెట్టిన హమాస్
అయితే కరేబియన్ ద్వీపం పర్యాటక కేంద్రంగా ఉంది. ఈ నేపథ్యంలో పర్యాటక కేంద్రమైన ద్వీపసమూహం లోని జనాభా తుఫాను తాకిడి లేని ప్రదేశాలలో ఆశ్రయం పొందాలని అలానే అధికారులు ఇచ్చే అన్ని సలహాలను గౌరవించి పాటించాలని అధికారులు ప్రజలను కోరారు. ఈ నేపథ్యంలో గ్వాడెలోప్‌లో వారాంతంలో జరగనున్న అన్ని ఈవెంట్‌లు రద్దు చేయబడ్డాయి. అలానే విమాన రాకపోకలు నిలిపివేశారు. ద్వీపాల మధ్య సముద్ర రవాణా కూడా నిలిచిపోయింది. శుక్రవారం ముందస్తు జాగ్రత్తగా ద్వీపం లోని నివాసితులు కావాల్సిన నీరు, ఆహారాన్ని సమకూర్చున్నారు. తుఫాను నుండి రక్షణ పొందేందుకు తగిన జాగ్రత్తలు తీనుకుంటున్నారు. కాగా ద్వీపసమూహం 1,700 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఇక్కడ 400,000 జనాభా నివసిస్తున్నారు. దాదాపు 7,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ద్వీపసమూహాన్ని ఫ్రాన్స్ పరిపాలిస్తుంది.