Leading News Portal in Telugu

Road Accident: యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన 5గురు మృతి


Road Accident: యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన 5గురు మృతి

Road Accident: శుక్రవారం అర్థరాత్రి గ్రేటర్ నోయిడాలోని యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై.. వ్యాన్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో కారులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ముగ్గురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం కారణంగా యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై భారీగా ట్రాఫిక్ జామ్‌ ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

జీరో పాయింట్‌కు 25 కిలోమీటర్ల దూరంలోని రబూపురా పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి 1 గంటల ప్రాంతంలో యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై వేగంగా వస్తున్న గుర్తు తెలియని వాహనం ఎకో వ్యాన్ నంబర్ DL 3 CC 7136ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. వ్యాన్ అదుపు తప్పి బోల్తా పడింది. వ్యాన్‌లో మొత్తం 8 మంది ప్రయాణిస్తున్నారు. వారిలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు, ముగ్గురు పిల్లలు గాయపడ్డారు. వారిని చికిత్స కోసం జెవార్‌లోని కైలాష్ ఆసుపత్రిలో చేర్చారు. ముగ్గురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది. వ్యాన్‌లో ఉన్న వారంతా ఢిల్లీ నుంచి జార్ఖండ్ వెళ్తున్నారని పోలీసులు తెలిపారు. గ్రేటర్ నోయిడా నుంచి జేవార్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల పంచనామా నమోదు చేసిన అనంతరం పోలీసులు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.

చనిపోయిన వారు..
1- ఉపేంద్ర బైతా (38).
2- బిజేంద్ర బైతా (36).
3-కాంతి దేవి (30)
4-కువ్ జ్యోతి (12)
5- సురేష్ (45).

గాయపడిన వారి పేర్లు
1- సూరజ్ (16).
2- ఆయుష్ (08).
3- ఆర్యన్ (10).