
RX 100 సినిమా అజయ్ భూపతిని కొత్త దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం చేసింది. ఈ సినిమాని రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ నుంచి తెరకెక్కించిన అజయ్ భూపతి సూపర్ హిట్ కొట్టాడు. ఆర్జీవీ శిష్యుడు అనే పేరుని నిలబెట్టుకున్న అజయ్ భూపతి, మరోసారి ఆడియన్స్ కి గూస్ బంప్స్ ఇచ్చే పనిలో ఉన్నాడు. మహా సముద్రం సినిమాతో డిజప్పాయింట్ చేసిన అజయ్ భూపతి, తన లక్కీ ఛార్మ్ పాయల్ రాజ్ ఫుత్ ని మెయిన్ క్యారెక్టర్ ప్లే చేయిస్తూ మంగళవారం సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే సాంగ్, పోస్టర్, టీజర్ తో సాలిడ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన అజయ్ భూపతి… లేటెస్ట్ గా మంగళవారం ట్రైలర్ తో మెస్మరైజ్ చేసాడు. స్టన్నింగ్ విజువల్స్, అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో బయటకి వచ్చిన మంగళవారం ట్రైలర్ ప్రాపర్ థ్రిల్లర్ సినిమాలా కనిపించింది. దాదాపు మూడు నిమిషాల నిడివితో కట్ చేసిన మంగళవారం ట్రైలర్…
“ఒక ఊరిలో గ్రామదేవతకి ఇష్టమైన మంగళవారం రోజునే మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. ఈ సమయంలో ఆ ఊరిలో ఏం జరుగుతుంది? హత్యలు ఎవరు చేస్తున్నారు? ఇందులో అమ్మవారికి లింక్ ఏంటి? మర్డర్స్ జరుగుతుంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది?” అనే మిత్ చుట్టూ అల్లిన కథతో మంగళవారం సినిమా తెరకెక్కింది. ఏ బోల్డ్ స్టోరీ టోల్డ్ లైక్ నెవర్ బిఫోర్ అనే క్యాప్షన్ పెట్టిన అజయ్ భూపతి, ట్రైలర్ తోనే దాన్ని జస్టిఫై చేసాడు. శివేంద్ర దాశరథి సినిమాటోగ్రఫీ, అజినీష్ లోకనాథ్ మ్యూజిక్ మంగళవారం ట్రైలర్ లో అవుట్ స్టాండింగ్ గా నిలిచాయి. పాయల్ ఇప్పటివరకు చేసిన పాత్రలకన్నా మంగళవారం సినిమాలో కంప్లీట్ కాంట్రాస్ట్ గా కనిపిస్తోంది. ముఖ్యంగా ట్రైలర్ ఎండ్ షాట్ లో పాయల్ ని అజయ్ భూపతి ఫ్రేమ్ చేసిన విధానం టూ గుడ్ అనే చెప్పాలి. మరి ప్రమోషనల్ కంటెంట్ తో మెప్పించిన అజయ్ భూపతి నవంబర్ 17న మంగళవారం సినిమాతో పాన్ ఇండియా హిట్ కొడతాడో లేదో చూడాలి.
A bold story told like never-before in Indian cinema 💥#MangalavaaramTrailer out now 🔥https://t.co/kF5LcNsN9L
An @AJANEESHB Musical 🎶#Mangalavaaram @starlingpayal @Nanditasweta @MudhraMediaWrks @ACreativeWorks_ #SwathiGunupati #SureshVarmaM @saregamasouth @PulagamOfficial… pic.twitter.com/IYET0iuWaM
— Ajay Bhupathi (@DirAjayBhupathi) October 21, 2023