Leading News Portal in Telugu

Chiru: మంగళవారం సినిమాకి మెగాస్టార్ సపోర్ట్…



Chiru

ఒక చిన్న సినిమా, మంచి సినిమా వస్తుంది అంటే అది తన ఫ్యామిలీ హీరో సినిమానా? లేక బయట హీరో సినిమానా అనేది చూడకుండా సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేయడం చిరంజీవికి అలవాటు. ప్రతి సినిమా గురించి మాట్లాడే చిరు… ఇటీవలే మిస్ శెట్టి మిస్టర్ పలిశెట్టి సినిమాకి ఫస్ట్ ఆడియన్స్ గా మారి రివ్యూ ఇచ్చారు. చిరు మాటని నిజం చేస్తూ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు చిరు నుంచి అలాంటి సపోర్ట్ నే సొంతం చేసుకుంది ‘మంగళవారం’ సినిమా. ఆర్జీవీ శిష్యుడు అజయ్ భూపతి డైరెక్షన్ లో… పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా మంగళవారం. నవంబర్ 17న రిలీజ్ కానున్న ఈ మూవీ ట్రైలర్ కొన్ని గంటల ముందే రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. సూపర్బ్ ట్రైలర్ కట్ తో థ్రిల్ చేసిన అజయ్ భూపతి… సాలిడ్ హిట్ కొట్టేలా ఉన్నాడు.

ఈ సినిమా ట్రైలర్ ని లాంచ్  చేస్తూ చిరు సోషల్ మీడియాలో ట్వీట్ చేసాడు. “మంగళవారం సినిమా నిర్మాతలు స్వాతి రెడ్డి గునుపాటి,సురేష్ వర్మ నాకు సన్నిహితులు. ముఖ్యంగా స్వాతి రెడ్డి, ఎంతో  డైనమిక్ అమ్మాయి. మా అమ్మాయి శ్రీజ కి  మంచి  స్నేహితురాలు. నాకు యువత, అందులోనూ యంగ్ విమెన్ సినిమా ఇండస్ట్రీ లో వివిధ శాఖల్లో కి  ఎంటర్ అవుతుంటే చాలా ఎక్సైటింగ్ గా వుంటుంది. వాళ్ళు వాళ్ళ కొత్త ఆలోచనలు, న్యూ ఎనర్జీ తో ఫిలిం మేకింగ్, మార్కెటింగ్ లకి ఒక కొత్త డైరెక్షన్ ని ఇవ్వగలరు. అందుకని స్వాతిరెడ్డి  లాంటి యంగ్ స్టర్ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి అజయ్ భూపతి లాంటి ఓ టాలెంటెడ్ డైరెక్టర్ తో  కలిసి తొలి ప్రయత్నంగా ఈ సినిమా చేయటం ఎంతో సంతోషం. విలేజ్ నేపథ్యంలో రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా ట్రైలర్ నా చేతుల మీదుగా రిలీజ్ అవుతున్నందుకు ఆనందంగా ఉంది. సినిమా సూపర్ డూపర్ సక్సెస్ సాధించాలని కోరుకుంటూ ఎంటైర్ టీంకి ఆల్ ది బెస్ట్” అంటూ చిరు ట్వీట్ చేసాడు. మరి చిరు చేసిన ట్వీట్ ని నిజం చేస్తూ మంగళవారం సినిమా హిట్ అవుతుందో లేదో చూడాలి.