
Swiss woman’s murder: ఢిల్లీలోని తిలక్ నగర్ ప్రాంతంలో శుక్రవారం స్విట్జర్లాండ్ మహిళ హత్యకు గురైంది. ఈ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. లీనా బెర్గర్(30) అనే మహిళ మృతదేహాన్ని శుక్రవారం ఉదయం ప్రభత్వ పాఠశాల సమీపంలోని బ్యాగులో గుర్తించారు. ఈ కేసులో గురుప్రీత్ సింగ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
స్విట్జర్లాండ్ లో పరిచమైన లీనాతో గురుప్రీత్ సింగ్ రిలేషన్షిప్ లో ఉన్నాడు. వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా ఎఫైర్ నడుస్తోందని పోలీసులు తెలిపారు. అయితే ఆమెకు వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని అందుకే హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. తరుచుగా గురుప్రీత్ ఆమెను కలుసుకునేందుకు స్విట్జర్లాండ్ వెళ్లే వాడని, అయితే ఆమెపై అనుమానం పెంచుకున్న నిందితుడు ఈ సారి లీనాను ఇండియాకు వచ్చే విధంగా ప్లాన్ చేసి హత్య చేశాడు.
గురుప్రీత్ అభ్యర్థన మేరకు లీనా అక్టోబర్ 11న భారత్ వచ్చింది. ఐదురోజుల తర్వాత ఓ గదిలోకి తీసుకెల్లి చేతులు, కాళ్లు కట్టేసి హత్య చేశాడు. అంతకు ముందు వేరే మహిళ ఐడీతో ఓ కారు కొనుగోలు చేసి మహిళ మృతదేహాన్ని కారులో ఉంచాడు. అయితే కారు నుంచి దుర్వాసన రావడంతో ఆమె మృతదేహాన్ని రోడ్డుపై వదిలేసి పరారయ్యాడు. సీసీ కెమెరా ఫుటేజీ ద్వారా కారు రిజిస్ట్రేషన్ వివరాలు సేకరించి నిందితుడు గురుప్రీత్ ని గుర్తించారు. అతని ఇంటి నుంచి రూ. 2.25 కోట్లు స్వాధీనం చేసుకున్నారు.