Leading News Portal in Telugu

Alluri Sitharama Raju district: 34 మందిలో ముగ్గురు మృతి.. భయాందోళనలో గ్రామస్తులు


Alluri Sitharama Raju district: 34 మందిలో ముగ్గురు మృతి.. భయాందోళనలో గ్రామస్తులు

Alluri Sitharama Raju district: ఆధునిక యుగంలో అంతరిక్షాన్ని సందర్శించి వస్తున్న ఈ కాలంలో ఇంకా కొందరు మంత్రాలకు చింతకాయలు రాల్తాయని విశ్వసించడం చాల బాధాకరం. ఆరోగ్యం బాగాలేకపోయిన, వరుస మరణాలు సంభవిస్తున్నా ప్రజలు వైద్య సేవలను తీసుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలా కాకుండా అదేదో మంత్రగాళ్ళ పనని వైద్యం చేయించుకోకపోతే మొదటికే మోసం వస్తుంది. ఇప్పుడు ఈ మాట చెప్పడానికి కారణం ఓ గ్రామంలో వరుసగా మనుషులు మరణిస్తున్నారు. దీనితో ఆ ప్రాంతానికి వైద్య సేవలు అందిచాలని వచ్చిన వైద్యులు చేత చికిత్స చేయించుకోవడానికి అంగీకరించడం లేదు అక్కడి ప్రజలు. ఈ ఘటన అల్లూరి సీతారామ రాజు జిల్లాలో చోటు చేసుకుంది.

Read also:Vivek Agnihotri: ఒకటి హిట్ ఇంకోటి డిజాస్టర్… ఇప్పుడు మహాభారతం పైన పడ్డాడు

వివరాల్లోకి వెళ్తే.. అల్లూరి సీతారామరాజు జిల్లా లోని అరకులోయ (మం) దూదికొండి గ్రామంలో రెండు రోజుల వ్యవధిలో ముగ్గురు గిరిజనులు అనారోగ్యంతో మృతిచెందారు. మృతి చెందిన వ్యక్తులు సమర్ధి బాబురావు ,కోడపల్లి బంగారమ్మ, కుర్ర రమేష్ అని ఆ గ్రామ వాసులు తెలియ చేశారు. అయితే గ్రామంలో కేవలం 34 మంది జనాభా మాత్రమే నివస్తున్నారు. ఈ నేపథ్యంలో వరుసగా ముగ్గురు మరణించడంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కాగా ఈ మరణాలను అరికట్టేందుకు వైదేలు అక్కడి ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారు. కానీ వైద్యం చేయించుకోవడానికి ప్రజలు వెనకడుగు వేస్తున్నారు. దీనికి కారణం ఆ ప్రాంతంలో చేతబడి చేశారని అందుకే మనుషులు చనిపోతున్నారని భయపడుతూ వైద్యం చేయించుకోవడానికి నిరాకరిస్తున్నారు. దీనితో వైద్యం చేసేందుకు డాక్టర్లు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.