Leading News Portal in Telugu

Janasena Leader Attacked: జనసేన నేతపై కట్టెలు, రాళ్లతో విచక్షణా రహితంగా దాడి..!


Janasena Leader Attacked: జనసేన నేతపై కట్టెలు, రాళ్లతో విచక్షణా రహితంగా దాడి..!

Janasena Leader Attacked: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో జనసేన పార్టీ నాయకుడిపై దాడి జరిగింది.. ఆ పార్టీ నేత కోటిరెడ్డి రాజారెడ్డిపై గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి దాడికి పాల్పడ్డారు.. జనసేన పార్టీ వ్యక్తిగత కార్యాలయం వద్ద పనులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న రాజారెడ్డి దగ్గరకు వచ్చిన కొందరు యువకులు.. ఆయనతో మొదట ఏదో మాట్లాడే ప్రయత్నం చేశారు.. ఆ తర్వాత చుట్టుముట్టి దాడిక పాల్పడ్డారు.. కట్టెలతో.. రాళ్లతో విచక్షణ రహితంగా దాడి చేశారు. ఈ దాడిలో కోటిరెడ్డి రాజారెడ్డి తీవ్ర గాయాలపాలైనట్టుగా తెలుస్తోంది..

ఇక, ఆ తర్వాత స్థానికులు రాజారెడ్డిని ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాజారెడ్డిని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి పరామర్శించారు.. అయితే, తనపై దాడి చేసింది వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందినవారేనని.. కార్యాలయం నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో దాదాపు 10 మంది వైసీపీ కార్యకర్తలు వచ్చి తనపై దాడి చేశారని చెబుతున్నారు రాజారెడ్డి. మరోవైపు.. వైసీపీ కార్యకర్తల దాడిపై తీవ్రంగా మండిపడ్డారు జనసేన పీఏసీ సభ్యుడు, ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి. ఎమ్మెల్యే అండతోనే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు.. స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి జాగ్రత్త అంటూ వార్నింగ్‌ ఇచ్చారు.. ఇక, రాజారెడ్డిపై దాడి చేసిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.. ఆ సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టారు పోలీసులు.