Leading News Portal in Telugu

Egypt’s aid for Gaza: ఈజిప్టు సహాయం సముద్రంలో నీటిచుక్క లాంటిది.. గాజా


Egypt’s aid for Gaza: ఈజిప్టు సహాయం సముద్రంలో నీటిచుక్క లాంటిది.. గాజా

Egypt’s aid for Gaza: హమాస్ ఇజ్రాయిల్ పైన అతి క్రూరంగా దాడి చేసింది. ప్రజలు చంపొద్దని వేడుకున్న కనికరించలేదు. చిన్న, పెద్ద అని తేడా చూడలేదు, మహిళలు పురుషులనే తారతమ్యం లేకుండా విచక్షణ రహితంగా 1400 మందికి పైగా చంపేశారు. దీనితో ఇజ్రాయిల్ హమాస్ ను శిధిలం చేస్తామని ప్రతిజ్ఞ చేసింది. అన్నట్టుగానే హమాస్ పాలనలో ఉన్న గాజా పైన బాంబుల వర్షం కురిపించింది. ఇజ్రాయిల్ దాడుల్లో 4500 మందికి పైగా మరణించారు. వందలమంది గాయపడ్డారు. ఇప్పటికి ఇజ్రాయిల్ గాజా పైన దాడులు జరుపుతూనే ఉంది. ఈ యుద్ధం కారణంగా గాజా పరిస్థితి దయానియ్యంగా మారింది. ఒక రొట్టె కోసం గంటల తరబడి క్యూలో నిలుచోవాల్సిన దుస్థితి గాజాలో నెలకొంది. దీనితో గాజా ప్రజలు సాహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో గాజాకు సహాయం చేసేందుకు ఈజిప్ట్ ముందుకు వచ్చింది.

Read also:Israel Palestine War: ఇజ్రాయెల్‌కు మద్దతు ఇచ్చినందుకు.. హిందూ డాక్టర్ ఉద్యోగం పోయింది

అనేక చర్చలు, US ఒత్తిడి తరవాత ఎట్టకేలకు శనివారం ఆహారం మరియు ఔషధాలను తీసుకువెళుతున్న 20 ట్రక్కులు మొదటి విడత కింద ఈజిప్ట్ నుండి పాలస్తీనియన్ ఎన్‌క్లేవ్‌ లోకి ప్రవేశించాయి. అయితే గాజా లో 2.4 మిలియన్ల నివాసితులు ఉన్నారు. అంతమందికి 20 ట్రక్కులు ఆహరం, ఔషదాలు ఎలా సరిపోతాయి? ఈ సహాయం సముద్రంలో నీటి బిందువు లాంటిదని అభివర్ణించారు. ఈజిప్ట్ నిర్వహించిన శాంతి శిఖరాగ్ర సమావేశంలో, UN చీఫ్ ఆంటోనియో గుటెర్రెస్ మాట్లాడుతూ ఈ యుద్ధం ఓ భయంకరమైన పీడకలని.. ఇప్పటికైనా ఈ దాడులు విరమించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అయితే అంతర్జాతీయ విభజనలకు చిహ్నంగా హమాస్‌ను స్పష్టంగా ఖండించాలని పాశ్చాత్య అధికారులు డిమాండ్ చేసారు. దీనితో సమావేశం ఏ ఉమ్మడి పిలుపును అంగీకరించలేకపోయింది.