Leading News Portal in Telugu

IND vs NZ: టాస్ గెలిచిన భారత్.. రెండు మార్పులతో బరిలోకి! తుది జట్లు ఇవే


IND vs NZ: టాస్ గెలిచిన భారత్.. రెండు మార్పులతో బరిలోకి! తుది జట్లు ఇవే

India opt to bowl in IND vs NZ Match: ప్రపంచకప్‌ 2023లో భాగంగా ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో మరికొద్దిసేపట్లో భారత్‌, న్యూజిలాండ్‌ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. భారత్ మూడు మార్పులతో బరిలోకి దిగుతోంది. హార్దిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్ స్థానాల్లో సూర్యకుమార్ యాదవ్, మొహ్మద్ షమీ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు కివీస్ విన్నింగ్ కాంబోతోనే ఆడుతోంది.

భారత్‌, న్యూజిలాండ్‌ జట్లు వన్డే ప్రపంచకప్‌ 2023లో వరుసగా నాలుగు విజయాలతో దూసుకెళుతున్నాయి. ఐదవ విజయంపై ఇరు జట్లు కన్నేశాయి. అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో కాలి మడమ గాయంతో అర్ధంతరంగా మైదానాన్ని వీడిన స్టార్ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా ఈ మ్యాచ్‌కు దూరం అయ్యాడు.

వన్డే ప్రపంచకప్‌లలో భారత్‌, న్యూజిలాండ్‌ టీమ్స్ ఎనిమిది సార్లు తలపడ్డాయి. అందులో అయిదు మ్యాచ్‌లు కివీస్‌ నెగ్గగా.. భారత్ మూడింట్లో గెలిచింది. చివరగా 2019లో సెమీస్‌లో భారత్‌పై న్యూజిలాండ్‌ పైచేయి సాధించింది.

తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.
న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, మిచెల్ సాంట్నర్, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్.