Leading News Portal in Telugu

World Cup 2023: ఆడిన తొలి మ్యాచ్లోనే అరుదైన ఘనత


World Cup 2023: ఆడిన తొలి మ్యాచ్లోనే అరుదైన ఘనత

వరల్డ్ కప్ 2023లో ఆడిన నాలుగు మ్యాచ్ల్లో అవకాశం లభించలేదు. కానీ హార్థిక్ పాండ్యా న్యూజిలాండ్ మ్యాచ్తో దూరం కావడంతో జట్టులోకి రెండు మార్పులు జరిగాయి. దీంతో ఇద్దరు ఆటగాళ్లకు ఛాన్స్ దొరికింది. అందులో ఒకరు సూర్యకుమార్ యాదవ్, మరొకరు మహమ్మద్ షమీ ఉన్నారు. అయితే ముందుగా బౌలింగ్ ఎంచుకున్న భారత్ బౌలర్లలో మొదట సిరాజ్ ఒక వికెట్ తీయగా.. రెండో వికెట్ షమీ సాధించాడు.

ఈ మ్యాచ్‌లో తన తొలి ఓవర్ మొదటి బంతికే వికెట్ తీశాడు. కివీస్‌ ఓపెనర్‌ విల్‌ యంగ్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. దీంతో ఈ వరల్డ్‌కప్‌లో షమీ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. మరోవైపు వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా తరపున అత్యధిక వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్‌గా షమీ నిలిచాడు. షమీ ఇప్పటివరకు వన్డే ప్రపంచకప్‌లో 32 వికెట్లు సాధించాడు. ఈ క్రమంలో అనిల్‌ కుంబ్లే(32)ను షమీ అధిగమించాడు. ఇదిలా ఉంటే.. ఈ ఘనత సాధించిన జాబితాలో టీమిండియా మాజీ పేసర్‌ జహీర్‌ ఖాన్‌ 44 వికెట్లతో తొలి స్ధానంలో ఉన్నాడు.

ఇదిలా ఉంటే.. ధర్మశాలలో న్యూజిలాండ్తో జరిగే మ్యాచ్లో భారత్ వరుస విజయాలపై కన్నేసింది. ఈ మ్యాచ్లో కివీస్ జట్టుపై టీమిండియా గెలుపొందితే పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్లో ఉండనుంది. మరోవైపు న్యూజిలాండ్పై భారత్ గెలిచిన సందర్భాలు ఎక్కువగా లేవు. చూడాలి మరీ న్యూజిలాండ్పై భారత్ గెలుస్తుందా లేదా అనేది.