Leading News Portal in Telugu

Chandrababu: ఈ కష్టకాలంలో ప్రజల్లోకి వెళ్లి పోరాడాలని భువనేశ్వరిని నేను కోరాను..



Babu

స్కిల్ డెవలప్మెంట్ స్కా్మ్ కేసులో అరెస్టైన మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. అయితే, చంద్రబాబు నాయుడు జైలు నుంచి నా ప్రియాతి ప్రియమైన తెలుగు ప్రజలందరికీ నమస్కారాలు అంటూ లేఖ విడుదల చేశారు. నేను జైలులో లేను.. మీ అందరి గుండెల్లో ఉన్నాను.. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న ప్రజాచైతన్యంలో ఉన్నాను అని ఆయన తెలిపారు. విధ్వంస పాలనని అంతం చేయాలనే మీ సంకల్పంలో నేను ఉన్నాను.. ప్రజలే నా కుటుంబం.. జైలు గోడల మధ్య కూర్చుని ఆలోచిస్తూ ఉంటే 45 ఏళ్ల ప్రజాజీవితం నా కళ్ల ముందు కదలాడుతోంది అని చంద్రబాబు అన్నారు.

Read Also: Health Tips: మీలో ఈ లక్షణాలు కనిపిస్తే సంకేతం దానికే..!

నా రాజకీయ ప్రస్థానమంతా తెలుగు ప్రజల అభివృద్ధి.. సంక్షేమమే లక్ష్యంగా సాగింది అని చంద్రబాబు తెలిపారు. దీనికి ఆ దేవుడితో పాటు మీరే సాక్ష్యం.. ఓటమి భయంతో నన్ను జైలు గోడల మధ్య బంధించి ప్రజలకి దూరం చేశామనుకుంటున్నారు.. నేను మీ మధ్య తిరుగుతూ ఉండకపోవచ్చు.. కానీ అభివృద్ధి రూపంలో ప్రతీ చోటా కనిపిస్తూనే ఉంటాను అని ఆయన పేర్కొన్నారు. సంక్షేమం పేరు వినిపించిన ప్రతీసారి నేను గుర్తుకొస్తూనే ఉంటాను.. ప్రజల నుంచి ఒక్క రోజు కాదు కదా!, ఒక్క క్షణం కూడా నన్ను దూరం చేయలేరు అని చెప్పారు. కుట్రలతో నాపై అవినీతి ముద్ర వేయాలని ప్రయత్నించారు.. కానీ, నేను నమ్మిన విలువలు, విశ్వసనీయతని ఎన్నడూ చెరిపేయలేరు అంటూ చంద్రబాబు లేఖలో వెల్లడించారు.

Read Also: JaiShankar: “పదే పదే భారత వ్యవహారాల్లో జోక్యం”.. 41 మంది కెనడా దౌత్యవేత్తల తొలగింపుపై జైశంకర్..

అయితే, ఎప్పుడూ బయటకు రాని స్వర్గీయ నందమూరి తారకరామారావు బిడ్డ, నా భార్య భువనేశ్వరిని నేను అందుబాటులో లేని ఈ కష్టకాలంలో ప్రజల్లోకి వెళ్లి వారి తరఫున పోరాడాలని నేను కోరాను అంటూ లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. ఆమె అంగీకరించింది.. నా అక్రమ అరెస్టుతో తల్లడిల్లి మృతి చెందిన వారి కుటుంబాలని పరామర్శించి, అరాచక పాలనను ఎండగట్టడానికి ‘నిజం గెలవాలి’ అంటూ మీ ముందుకు వస్తోంది.. జనమే నా బలం, జనమే నా ధైర్యం.. దేశ విదేశాలలో నా కోసం రోడ్డెక్కిన ప్రజలు వివిధ రూపాల్లో మద్దతు తెలుపుతున్నారు అని ఆయన తెలిపారు.

Read Also: Director Hari: సింగం డైరెక్టర్ ఇంట తీవ్ర విషాదం

నా క్షేమం కోసం కుల, మత, ప్రాంతాలకు అతీతంగా మీరు చేసిన ప్రార్థనలు ఫలిస్తాయి అని చంద్రబాబు నాయుడు అన్నారు. న్యాయం ఆలస్యం అవ్వొచ్చునేమో కానీ, అంతిమంగా గెలిచేది మాత్రం న్యాయమే.. మీ అభిమానం, ఆశీస్సులతో త్వరలోనే బయటకి వస్తాను.. అంత వరకూ నియంత పాలనపై శాంతియుత పోరాటం కొనసాగించండి.. చెడు గెలిచినా నిలవదు.. మంచి తాత్కాలికంగా ఓడినట్లు కనిపించినా కాల పరీక్షలో గెలిచి తీరుతుంది.. త్వరలోనే చెడుపై మంచి విజయం సాధిస్తుంది అంటూ ఈ సందర్భంగా అందరికీ విజయదశమి శుభాకాంక్షల అని రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి చంద్రబాబు ఈ లేఖను విడుదల చేశారు.

Ltr

Ltr