Leading News Portal in Telugu

IND vs NZ: 273కు న్యూజిలాండ్ ఆలౌట్.. 5 వికెట్లతో చెలరేగిన షమీ


IND vs NZ: 273కు న్యూజిలాండ్ ఆలౌట్.. 5 వికెట్లతో చెలరేగిన షమీ

IND vs NZ: ప్రపంచకప్ 2023లో భాగంగా ధర్మశాలలో భారత్-న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో నిర్ణీత 50 ఓవర్లలో కివీస్ జట్టు 273 పరుగులు చేసింది. ఇక భారత బౌలర్లలో మహమ్మద్ షమీ 5 వికెట్లతో చెలరేగాడు. కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీయగా.. జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్ తలో వికెట్ సాధించారు.

తొలుత టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. న్యూజిలాండ్ ను బ్యాటింగ్ కు పంపించింది. క్రీజులోకి వచ్చిన ఓపెనర్లు కాన్వే డకౌట్ కాగా, విల్ యంగ్ (17) పరుగులు చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన రచిన్ రవీంద్ర (75), డారిల్ మిచెల్ (130) పరుగులు చేసి సెంచరీతో అదరగొట్టాడు. ఒకానొక దశలో న్యూజిలాండ్ భారీ స్కోరు సాధిస్తుందనిపించినా… టీమిండియా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి కివీస్ బ్యాట్స్ మెన్లను కట్టడి చేశారు.

ఇక భారత బౌలర్లలో షమీ అద్భుతంగా బౌలింగ్ చేసి 5 వికెట్లు పడగొట్టాడు. 48వ ఓవర్లలో వరుసగా రెండు వికెట్లు తీశాడు. ఇదిలా ఉంటే.. వరల్డ్ కప్ లలో షమీ మొత్తం వికెట్లు 36కి పెంచుకున్నాడు. అంతేకాకుండా.. వరల్డ్ కప్ లలో ఐదేసి వికెట్లను రెండుసార్లు పడగొట్టిన తొలి భారత బౌలర్ గా ఘనత అందుకున్నాడు. ఇక ఇప్పుడు టీమిండియా బ్యాట్స్ మెన్లు నిలకడగా ఆడి మరో విజయం సాధించాలని ఆశిస్తున్నారు.