Leading News Portal in Telugu

Reece Topley: ఇంగ్లండ్‌కు బిగ్ షాక్.. ప్రపంచకప్ నుండి ఫాస్ట్ బౌలర్ రీస్ టాప్లీ ఔట్


Reece Topley: ఇంగ్లండ్‌కు బిగ్ షాక్.. ప్రపంచకప్ నుండి ఫాస్ట్ బౌలర్ రీస్ టాప్లీ ఔట్

Reece Topley: ప్రపంచకప్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లండ్‌కు కష్టాలు ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే వరుసగా రెండు మ్యాచ్ ల్లో ఆడి కష్టాల్లో ఉన్న ఇంగ్లీష్ జట్టుకు ఇదొక బిగ్ షాక్ అని చెప్పవచ్చు. తాజాగా.. ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ రీస్ టాప్లీ గాయం కారణంగా ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో రీస్ టోప్లీ వేలికి గాయమైంది. దీంతో మొత్తం టోర్నమెంట్ నుండి తప్పుకోవాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఇంగ్లాండ్ ఆటగాళ్లు పేలవమైన ఫామ్‌తో ఉన్నారు. దీనికి తోడు ఇంగ్లండ్ స్టార్ బౌలర్ లేకపోవడంతో ఆ జట్టుకు పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు.

ఇదిలా ఉంటే.. జోస్ బట్లర్ సారథ్యంలోని ఇంగ్లండ్ జట్టు పేలవ ఫామ్ ప్రదర్శన కనపరుస్తోంది. ఇప్పటి వరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో ఇంగ్లండ్ తొమ్మిదో స్థానంలో ఉంది. పాయింట్ల పట్టికలో ఇంగ్లండ్ కంటే అఫ్గానిస్థాన్ కింద ఉంది. టాప్ లో న్యూజిలాండ్‌.. రెండు, మూడు స్థానాల్లో ఇండియా, సౌతాఫ్రికా ఉన్నాయి. ఇక ఇంగ్లండ్ తర్వాత మ్యాచ్ అక్టోబర్ 26న శ్రీలంకతో తలపడనుంది.