
హైదరాబాద్‌కు 260 కిలోమీటర్ల దూరంలో ఉన్న మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన కొన్ని స్తంభాలు కొన్ని అడుగుల మేర మునిగి నిర్మాణానికి ముప్పు వాటిల్లిన ఘటనపై ఇన్ఫ్రాస్ట్రక్చర్ దిగ్గజం ఎల్అండ్టీ , తెలంగాణ ప్రభుత్వం విచారణ చేపట్టాయి. అయితే.. ఈ నేపథ్యంలోనే మేడిగడ్డ బ్యారేజీపై ఎల్ అండ్ టీ కంపెనీ కీలక ప్రకటన చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగంగా 2019 సంవత్సరంలో L&టీ 1.632 కి.మీ పొడవైన లక్ష్మీ బ్యారేజీ (మేడిగడ్డ)ని నిర్మించింది. అప్పటి నుండి బ్యారేజీ పని చేస్తోంది.
ఇటీవలి 2023 సీజన్‌తో సహా గత ఐదు వరద సీజన్లను బ్యారేజ్ తట్టుకుంది. గత సంవత్సరం ఈ బ్యారేజీకి 28.25L క్యూసెక్కుల డిజైన్ డిశ్చార్జ్ ఉంటే..అత్యధికంగా 28.70 లక్షల క్యూసెక్కుల వరద నమోదైంది. బ్యారేజీ రూపకల్పన పూర్తిగా తెలంగాణ రాష్ట్ర ఇంజనీర్ల డిజైన్ మేరకే చేపట్టాం. జులై 2022లో సంభవించిన భారీ వరదల్లో కూడా బ్యారేజీ సురక్షితంగా తట్టుకుంది. నిన్న సాయంత్రం, బ్యారేజ్‌లోని బ్లాక్-7లోని ఒక ప్రదేశంలో పెద్ద శబ్ధం వచ్చి వంతెన భాగం కుంగిపోయింది. జరిగిన నష్టాన్ని రాష్ట్ర అధికారులతో మా సాంకేతిక నిపుణుల బృందం ఇప్పటికే ప్రాజెక్ట్ సైట్‌కు పంపించాము. L&T నష్టాలను సాంకేతికంగా అంచనా వేసిన తర్వాత సాధ్యమైనంత త్వరగా నష్టాన్ని సరిదిద్దడానికి అవసరమైన చర్య తీసుకుంటుంది.’ అని పేర్కొంది