Leading News Portal in Telugu

Pawan Kalyan: వంగవీటి రాధా పెళ్లిలో పవన్.. ఫోటో వైరల్


Pawan Kalyan: వంగవీటి రాధా పెళ్లిలో పవన్.. ఫోటో వైరల్

Pawan Kalyan:వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ వివాహం ఘనంగా జరిగింది. నరసాపురానికి చెందిన జక్కం బాబ్జి, అమ్మాణిల కుమార్తె పుష్పవల్లితో రాధా వివాహం విజయవాడ పోరంకిలోని మురళీ రిసార్ట్స్ అంగరంగ వైభవంగా జరిగింది. ఇక ఈ వివాహానికి అతిరథ మహారధులు హాజరయ్యారు. రాజకీయానికి అతీతంగా అందరు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇక తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం పెళ్ళికి హాజరై సందడి చేశారు. ఇక పవన్ ను రాధా సాదరంగా ఆహ్వానించాడు. ఇక నూతన వధూవరులను ఆశీర్వదించిన పవన్ కొద్దిసేపు రాధాతో ముచ్చటించి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ ఫోటోలను జనసేన తన అధికారిక అకౌంట్ లో పోస్ట్ చేసి.. రాధాకు శుభాకాంక్షలు తెలిపింది. “విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శ్రీ వంగవీటి రాధాకృష్ణ వివాహ వేడుకకు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు హాజరయ్యారు. ఆదివారం రాత్రి విజయవాడ, పోరంకిలోని మురళీ రిసార్ట్స్ లో జరిగిన ఈ వేడుకకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు హాజరయ్యారు. నూతన వధూవరులు వంగవీటి రాధాకృష్ణ, పుష్పవల్లిలకు శుభాకాంక్షలు తెలిపారు”

Prabhas: కటౌట్ చూసి.. కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్

ఇక వంగవీటి రాధా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వంగవీటి రాధా ఇటీవల జనసేనలో చేరనున్నారని వార్తలు గుప్పుమన్నాయి. మరోవైపు గత నెలలో గోదావరిజిల్లాల్లో జరిగిన వారాహి యాత్ర సందర్భంగా నరసాపురంలో జక్కం బాబ్జీ ఇంట్లో పవన్ కల్యాణ్‌ బస చేశారు. ఈ నేపథ్యంలో రాధా కూడా జనసేనలోకి వెళ్తారనే ప్రచారం జరిగింది. వంగవీటి రాధా కృష్ణ విజయవాడ తూర్పు నియోజక వర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరపున తొలిసారి 2004లో గెలిచారు. ఆ తర్వాత రాజకీయాల్లో చురుగ్గా కొనసాగుతున్నప్పటికీ మళ్లీ అసెంబ్లీలో అడుగుపెట్టలేదు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్న వంగవీటి రాధా.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకుంటున్నాడని టాక్. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.