Leading News Portal in Telugu

Mahua Moitra: ఎంపీ మహువా మోయిత్రా ఖరీదైన గిఫ్టులు కోరింది.. చేయకూడని పనులు చేయించింది..


Mahua Moitra: ఎంపీ మహువా మోయిత్రా ఖరీదైన గిఫ్టులు కోరింది.. చేయకూడని పనులు చేయించింది..

Mahua Moitra: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా చిక్కుల్లో పడ్డారు. ‘ప్రశ్నకు డబ్బు’ కేసులో ఇరుక్కుపోయింది. అదానీ గ్రూపును, ప్రధాని నరేంద్రమోడీని అభాసుపాలు చేసేందుకు డబ్బులు తీసుకుని పార్లమెంట్ లో ప్రశ్నలు అడిగిందని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే చేసిన ఆరోపణలు చేశారు. దీనికి బలం చేకూరుస్తే.. వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ పార్లమెంట్ ఎథిక్స్ కమిటీకి లేఖ రాయడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన ఈ లేఖలో పలు ఆరోపణలు చేశారు. ఇదిలా ఉంటే తనకు దర్శన్ రాసిన లేఖ అందిందని ఎథిక్స్ కమిటీ చైర్మన్ వినోద్ సోంకర్ తెలిపారు. ఇది తీవ్రమైన విషయం కావడంతో ఎథిక్స్ కమిటీ దీన్ని పరిశీలిస్తోందని తెలిపారు.

దర్శన్ హీరానందానీ రాసిన లేఖలో 10 సంచలన ఆరోపణలు చేశారు.

* మహువా మోయిత్రా జాతీయ స్థాయిలో త్వరగా పేరు తెచ్చుకోవాలని కోరుకుంది. దీనికి కోసం ప్రధాని నరేంద్రమోడీని లక్ష్యంగా చేసుకోవడం ద్వారా పేరు సంపాదించుకోవాలని మహుమా మోయిత్రా తన సన్నిహితులకు చెబుతుండేది.

* గౌతమ్ అదానీ, మోదీ ఒకే రాష్ట్రానికి చెందిన వారు కాబట్టి మోడీపై దాడి చేయడమే ఏకైక మార్గమని మోయిత్రా భావించారు.

* అదానీ గ్రూపును లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే అంశాలున్న ప్రశ్నలను ఆమె రూపొందించారు.

* ఆమె తన పార్లమెంట్ సభ్యుడిగా తన ఈమెయిల్ ఐడీని నాతో పంచుకున్నారు. తద్వారా నేను ఆమెకు సమాచారాన్ని పంపగలిగాను. దీంతో ఆమె పార్లమెంట్ లో ప్రశ్నలు లేవనెత్తవచ్చు. నేను ప్రశ్నలను నేనుగా పోస్టు చేయడానికి వీలుగా ఆమె తన పార్లమెంట్ లాగిన్, పాస్ వర్డ్ అందించింది.

* ఇలా వ్యక్తిగతం టార్గెట్ చేసేందుకు నాతో పాటు మరికొందరు సహకరించారు. అదానీ కంపెనీలకు సంబంధించిన విషయాలపై రాహుల్ గాంధీ సహా పలువురు కాంగ్రెస్ నేతలతో ఆమె సంప్రదింపులు జరిపారు.

* మోయిత్రాకు ఫైనాన్షియల్ టైమ్స్, న్యూయార్క్ టైమ్స్, బీబీసీతో పాటు పలు భారతీయ మీడియా సంస్థల నుంచి అంతర్జాతీయ జర్నలిస్టులతో తరుచుగా సంప్రదించేది.

* ఆమె గతంలో అదానీ గ్రూపు ఉద్యోగులుగా చెప్పుకునే కొందరితో సహా అనేక సోర్సుల నుంచి ధృవీకరించని వివరాలను అందుకుంది. నిర్థిష్ట సమాచారం నాతో షేర్ చేసుకుంది. దాని ఆధారంగా నేను ఆమె పార్లమెంటరీ లాగిన్ ని ఉపయోగించుకుని ప్రశ్నల్ని పోస్టు చేయడం కొనసాగించాను.

* రాహుల్ గాంధీ, శశి థరూర్, పినాకిని మిశ్రా వంటి ప్రతిపక్ష నాయకులతో ఆమెకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. ఆమె ద్వారా ప్రతిపక్షాలు పాలించే ఇతర రాష్ట్రాల్లో నాకు మద్దతు లభిస్తుందని భావించాను.

* ఆమె తరుచుగా తనకు విలాసవంతమైన వస్తువులను బహుమతులను ఇవ్వడంతో పాటు ఖరీదైన వస్తువులను డిమాండ్ చేసేది. ఢిల్లీలో ఆమె అధికారికంగా కేటాయించిన బంగ్లా పునరుద్ధర్ణకు మద్దతు ఇవ్వడం, ప్రయాణ ఖర్చులు సాయం చేయడంతో పాటు, ఆమె నన్ను అనవసరంగా ఉపయోగించుకుంటోంది.

* నేను చేయకూడని పనులను చేయమని ఒత్తిడి చేస్తోందని నేను భావించాను. చేకానీ కొన్ని కారణాల వల్ల నాకు వేరే మార్గం లేదని దర్శన్ హీరానందాని తెలిపారు.