Leading News Portal in Telugu

TDP-Janasena Meeting: నేడే టీడీపీ-జనసేన పార్టీల తొలి జేఏసీ సమావేశం


TDP-Janasena Meeting: నేడే టీడీపీ-జనసేన పార్టీల తొలి జేఏసీ సమావేశం

నేడు టీడీపీ-జనసేన పార్టీల తొలి జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం అవుతుంది. రాజమండ్రిలో మధ్యాహ్నం 3 గంటలకు హోటల్ మంజీరాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్- జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ల అధ్యక్షతన ఈ తొలి జేఏసీ సమావేశం జరుగనుంది. జగన్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలపై పోరాటానికి ఇరు పార్టీలు కార్యాచరణ సిద్దం చేయనున్నాయి. కరువు వల్ల రైతులు పడే ఇబ్బందులపై ప్రధానంగా ఇరు పార్టీలు ఫోకస్ పెట్టనున్నాయి. విద్యారంగంలో జరుగుతోన్న స్కాంలపై భేటీలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. తెలంగాణ ఎన్నికల్లో కలిసి పోటీ చేసే అంశం పైనా భేటీలో చర్చించే ఛాన్స్ ఉంది.

ఇక, రాష్ట్రంలో ప్రజా సమస్యలపై ఉమ్మడి పోరాటం, ఉద్యమ కార్యాచరణ, తాజా రాజకీయ పరిణామాలు, ఇరు పార్టీల సమన్వయంపై ఈ జాయింట్ యాక్షన్ కమిటీలో ప్రధానంగా చర్చించనున్నారు. ఇప్పటికే జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులను టీడీపీ- జనసేన పార్టీలు ప్రకటించాయి. అయితే, ఈ కీలక సమావేశానికిక రాజమండ్రి వేదికగా మారింది. టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు జైలులో ఉన్న రాజమండ్రినే జేఏసీ భేటీకి వేదికగా ఇరు పార్టీలు నిర్ణయించాయి. రాజకీయ కార్యక్రమాల స్పీడు పెంచేలా టీడీపీ- జనసేన పార్టీలు ప్రణాళికలు సిద్దం చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. ఈ సమావేశానికి ఇరు పార్టీలకు చెందిన 14 మంది జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు హాజరు కానున్నారు.