Leading News Portal in Telugu

Sudigali Sudheer: సుధీర్ తో పెట్టుకుంటే.. తలలు తెగిపడడమే


Sudigali Sudheer: సుధీర్ తో పెట్టుకుంటే.. తలలు తెగిపడడమే

Sudigali Sudheer: జబర్దస్త్ నటుడు సుడిగాలి సుధీర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే. ఇప్పటికే సుధేర్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఒకటి కాలింగ్ సహస్ర, ఇంకొకటి గోట్. ఇక కాలింగ్ సహస్ర ఎప్పుడో మొదలైంది కానీ, మధ్యలో గ్యాప్ రావడం వలన షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాకు అరుణ్ విక్కిరాలా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సుధీర్ సరసన డోలిశ్య హీరోయిన్ గా నటిస్తోంది. షాడో మీడియా ప్రొడక్షన్స్, రాధా ఆర్ట్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా నేడు విజయదశమి పండుగ కావడంతో.. కొత్త పోస్టర్లు రిలీజ్ చేసి అభిమానులకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ పోస్టర్స్ లో సుధీర్ లుక్ చాలా భయంకరంగా కనిపిస్తుంది.

Ustaad Bhagat Singh : పవన్ పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్..

ఒక పోస్టర్ లో రక్తంతో నిండిన కత్తిని చూపిస్తూ కలిపించాడు. ఇక రెండో పోస్టర్ లో హీరోయిన్ వీల్ చైర్ లో ఉండగా.. ఆమె వెనుక కత్తి పట్టుకొని నిలబడి ఉన్నాడు. ఇక వెనుక బ్యాక్ గ్రౌండ్ లో విలన్స్ తలలు తెగిపడినట్లై చూపించారు. ఇక ఈ షాట్ క్లైమాక్స్ లో తీసినట్లు కనిపిస్తుంది. అంటే.. ఈ సినిమాలో సుధీర్ తో పెట్టుకుంటే.. తలలు తెగిపడడడం ఖాయమని మేకర్స్ చెప్పకనే చెప్పుకొచ్చారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుందని, నవంబర్ లో రిలీజ్ కానుందని మేకర్స్ తెలిపారు. మరి ఈ సినిమాతో సుధీర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.