Leading News Portal in Telugu

Uday Kumar Reddy: గాల్లో కాల్పులు జరిపి విజయ దశమి పూజ.. ప్రారంభించిన జిల్లా ఎస్పి ఉదయ్


Uday Kumar Reddy: గాల్లో కాల్పులు జరిపి విజయ దశమి పూజ.. ప్రారంభించిన జిల్లా ఎస్పి ఉదయ్

Uday Kumar Reddy: ఆదిలాబాద్ జిల్లా ఐదు రౌండ్లు గాల్లో కాల్పులు జరిపి విజయ దశమి పూజను జిల్లా ఎస్పి ఉదయ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. పోలీసు సాయుధ భాండాగారంను శాస్త్రృత్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని ఆయుధ భాండాగార మందిరంలో పోలీసు అధికారులు వేద పండితుల శాస్త్రక్తాల మధ్య సాంప్రదాయబద్ధంగా దుర్గామాత సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదుపరి శమీ చెట్టు వద్ద పూజలు నిర్వహించి, విజయానికి చిహ్నంగా ఆకాశం వైపు తుపాకితో ఐదు రౌండ్లని కాల్చి విజయదశమిని ప్రారంభించారు.

అనంతరం సాయుద పోలీస్ విభాగంలో పనిచేస్తున్న డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్ టీం, పోలీసు వాహనాలు తదితర విభాగాల్లో సిబ్బందితో కలిసి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలు ఘనంగా విజయదశమి ఉత్సవాలను జరుపుకోవాలని జిల్లాలో ప్రశాంత వాతావరణ నెలకొల్పడానికి పోలీస్ శాఖ అహర్నిశలు శ్రమిస్తున్నట్లు తెలిపారు. పోలీస్ శాఖలో ఆయుధాలు కీలకపాత్ర పోషిస్తాయని, సాయిధ బలగాల సంరక్షణలో భద్రపరుస్తారని తెలిపారు.
Vemulawada: భక్తులతో కిటకిటలాడున్న వేములవాడ ఆలయం