Leading News Portal in Telugu

Japan: కార్తీతో టచింగ్.. టచింగ్ కావాలంటున్న మజ్ను బ్యూటీ


Japan: కార్తీతో టచింగ్.. టచింగ్ కావాలంటున్న మజ్ను బ్యూటీ

Japan: మజ్ను సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన మలయాళీ బ్యూటీ అను ఇమ్మానియేల్. మొదటి సినిమాతోనే తెలుగు కొరకారు గుండెల్లో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకుంది. ఇక ఈ సినిమా తర్వాత కుర్ర హీరోల పక్కన నటించింది కానీ, ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. తెలుగు నుంచి తమిళ్ కు వెళ్లి.. అక్కడ కూడా స్టార్ హీరోల సరసన నటించింది. తమిళ్ లో కూడా అమ్మడి దశ తిరగలేదు. బొద్దుగా , ముద్దుగా ఉన్న ఈ పాప.. బక్కచిక్కి.. హాట్ గా తయారయ్యింది. అందాల ఆరబోతకు కూడా సై అని చెప్పినా కూడా సినిమా అవకాశాలు మాత్రం అంతంత మాత్రంగానే వాచాయి. ఇక తెలుసులో అను .. గతేడాది అల్లు శిరీష్ సరసన ఉర్వశివో రాక్షసీవో సినిమాలో నటించింది. ఇది కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇక ప్రస్తుతం అమ్మడి ఆశలు అన్ని జపాన్ పైనే పెట్టుకుంది. కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ హీరోగా నటిస్తున్న చిత్రం జపాన్. రాజు మురగన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Mega 156: బ్రేకింగ్.. పండుగ పూట షాకింగ్ న్యూస్ చెప్పిన చిరు

ఇక నేడు దసరా పండుగ సందర్భంగా జపాన్ లోని మొదటి లిరికల్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. టచింగ్.. టచింగ్ అంటూ సాగే ఈ సాంగ్ చాలా క్రేజీగా వుంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ సాంగ్ కు భాస్కర్ బట్ల లిరిక్స్ అందించగా.. కార్తీ, ఇంద్రవతి చౌహన్ ఆలపించారు. సాంగ్ వీడియోలో అంత 90 వ దశకంలో ఉన్న సెటప్ కనిపించింది. హీరో, హీరోయిన్లు కలర్ ఫుల్ డ్రెస్ లో మెరుస్తూ జానీ మాస్టర్ నేర్పించిన హుక్ స్టెప్స్ తో అలరించారు. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే జపాన్ తెలుగు, తమిళ్ భాషల్లో దీపావళీ కానుకగా రానుంది. మరి ఈ సినిమా అయినా అనుకు హిట్ ను ఇస్తుందో లేదో చూడాలి.